హెచ్‌సీఏపై అవినీత ఆరోపణలు..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్న రాయుడు దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన రాయుడు. ఆ సీజన్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనంతరం హెచ్‌సీఏపై సంచలన ఆరోపణలు చేశాడు. శివలాల్ యాదవ్ తనయుడు అర్జున్ యాదవ్‌ను కోచ్‌గా నియమించడాన్ని తప్పుబట్టాడు. అసోసియేషన్‌లో అవినీతి పేరుకు పోయిందని ప్రెసిడెంట్ అజారుద్దీన్ దృష్టికి తీసుకెళ్లాడు. అర్హత లేని ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేస్తున్నారని, అందుకే హైదరాబాద్ దేశవాళీ క్రికెట్‌లో రాణించలేకపోతుందన్నాడు.

మంత్రి కేటీఆర్‌కు ట్వీట్..
అజారుద్దీన్ నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లాడు. 'హలో కేటీఆర్ సార్. హెచ్‌సీఏలో తీవ్రంగా ప్రబలిన అవినీతిపై దృష్టి పెట్టండి. అసలు హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్‌సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్‌సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు' అని అంబటి రాయుడు అప్పట్లో ట్వీట్ చేశాడు.

ఆంధ్రకు గుడ్‌బై..
ఆరోపణలు చేసిన సీజన్ రంజీ క్రికెట్‌కు దూరంగా ఉన్న రాయుడు తర్వాత ఆంధ్ర జట్టుకు ఆడాడు. అక్కడ ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్లీ బరోడాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇక అంబటి రాయుడు టీమిండియాకు 55 వన్డేలు, 6 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019 మార్చిలో జాతీయ జట్టుకు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












