ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 4 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ తెరలేవనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను ప్రారంభించాయి. ఐపీఎల్ 2025 సీజన్‌కు మెగా వేలం నిర్వహించడంతో జట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో 10 జట్ల కాంబినేషన్స్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
మరోవైపు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనాలతో బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్ ఈ లీగ్‌పై హైప్‌ను పెంచుతుంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కాంబినేషన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంచనా వేసాడు. తన జట్టులో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వలేదు.

ఓపెనర్లుగా రోహిత్, ర్యాన్..
రాయుడి అంచనా ప్రకారం.. రోహిత్ శర్మ, సౌతాఫ్రికా యువ ప్లేయర్ ర్యాన్ రికెల్టన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. తెలుగు తేజం తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడనుండగా.. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో..బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా, నమన్ దిర్, మిచెల్ సాంట్నర్ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు.
ముంబై ఇండియన్స్ పేస్ బాధ్యతలను జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లు పంచుకోనున్నారు. 11వ ఆటగాడు ఎవరా? అనేది రాయుడు వెల్లడించలేదు. ముంబై ఇండియన్స్ ప్రతీ సీజన్‌లో ఓ కొత్త కుర్రాడిని పరిచయం చేస్తుందని తెలిపాడు.
విల్ జాక్స్‌కు నో ఛాన్స్
రాయుడు తన జట్టులో అర్జున్ టెండూల్కర్‌తో పాటు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌కు అవకాశం ఇవ్వలేదు. మార్చి 23న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లకు బుమ్రా దూరం కానున్నాడు. ప్రస్తుతం అతను వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
బీసీసీఐ మెడికల్ టీమ్ ఇంకా అతని ఫిట్‌నెస్‌పై క్లీన్ ఛీట్ ఇవ్వలేదు. ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్‌తో బుమ్రా కలిసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్‌లో బుమ్రా వెన్ను గాయానికి గురైన విషయం తెలిసిందే.
అంబటి రాయుడి ముంబై ఇండియన్స్ తుది జట్టు అంచనా:
ర్యాన్ రికెల్టన్(కీపర్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజన్‌ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, క్రిష్ణన్ ష్రిజిత్, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, లిజాడ్ విలియమ్స్, విగ్నేష్ పుతుర్.