Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డియర్ ఆర్‌సీబీ ఫ్యాన్స్.. ఈసారి మీకు తిరుగులేదు: అంబటి రాయుడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టుపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. గత రెండు రోజులుగా ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కూడా ఆర్‌సీబీ ఈ సారి టైటిల్ గెలువద్దని గట్టిగా కోరుకుంటున్నానని కూడా తెలిపాడు. కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ సమష్టి ప్రదర్శనతో ఘన విజయం సాధించడంతో రాయుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

ఆ మ్యాచ్ అనంతరమే ఆర్‌సీబీపై ప్రశంసల జల్లు కురిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 'ఈ సారి ఆర్‌సీబీ చాలా పటిష్టంగా ఉంది. టైటిల్ గెలిచే టీమ్‌లా కనిపిస్తోంది'అని తెలిపాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆర్‌సీబీ ఘన విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులు రాయుడిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాయుడు ఎక్కడా? ఆర్‌సీబీ విజయాన్ని తట్టుకోగలుగుతున్నాడా? అని ప్రశ్నిస్తూ పోస్ట్‌లు పెట్టారు.

Ambati Rayudu Hits Back RCB Fans Trolls With Cheeky Reply After Defeating CSK in IPL 2025

గతేడాది సీఎస్‌కేతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. ఆ సమయంలో ఆర్‌సీబీ ఆటగాళ్లు, ఫ్యాన్స్ టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న రాయుడు.. ఆర్‌సీబీ జట్టుపై, అభిమానులపై తీవ్ర విమర్శలు చేశాడు. ఆర్‌సీబీ టైటిల్ గెలవదని ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడు. అప్పటి నుంచి రాయుడు, ఆర్‌సీబీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ యుద్దం నడుస్తోంది. తాజా సీజన్‌లో ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేయడంతో రాయుడిని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఆర్‌సీబీ ఫ్యాన్స్ పేజీలో పెట్టిన ఓ పోస్ట్‌కు అంబటి రాయుడు స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్‌లో సీఎస్‌కే‌పై ఆర్‌సీబీ విజయాన్ని ప్రస్తావిస్తూ రాయుడిపై అభిమానులు సెటైర్లు పేల్చారు.

'కామెంట్రీ ప్యానెల్‌లో ఉండాల్సిన ఓ కీలక వ్యక్తి గత రెండు గంటలుగా ఆన్‌లైన్‌లో మిస్సయ్యాడు. అతని గురించి మేం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాం. మీకు ఎవరికైనా తెలిస్తే మమ్మల్ని సంప్రదించండి. అంబటి రాయుడు బానే ఉన్నాడని ఆశిస్తున్నాం.'అని ఆర్‌సీబీ ఫ్యాన్స్ అఫిషియల్ పేజీలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై రాయుడు నవ్వుతూ స్పందించాడు. ఆర్‌సీబీ అభిమానుల సెటైర్లు బాగున్నాయని, ఈ ఏడాది వారికి తిరుగులేదని పేర్కొన్నాడు.

'హహహహ ఇది బాగుంది.. ఆర్‌సీబీ ఫ్యాన్స్. హరిహాసం అంటే ఇలా ఉండాలి. ఈ ఏడాది మీకు గొప్ప టీమ్ ఉంది. మీరు అత్యుత్తమ ఫలితాన్నిఆశించవచ్చు.'అని బదులిచ్చాడు. అంతకుముందు సీఎస్‌కే ఓటమిపై స్పందించిన రాయుడు.. ఆ జట్టు మిడిలార్డర్‌ బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే సీఎస్‌కే.. మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకోవాలని సూచించాడు.

Story first published: Saturday, March 29, 2025, 20:44 [IST]
Other articles published on Mar 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+