అతను జిడ్డుగా ఆడి చివర్లో బౌండరీలు కొట్టే రకం కాదు: అంబటి రాయుడు
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అండగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ ఎప్పుడూ ఫామ్‌లోనే ఉంటాడని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్‌ను విమర్శించేవారిని చూస్తే తనకు నవ్వొస్తుందని చెప్పాడు.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆదివారం జరిగిన చివరి టీ20ల్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఇషాన్ కిషన్‌తో కలిసి ఆదుకున్నాడు. 43 బంతుల్లోనే 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ.. అయ్యర్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది.

శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గురించి క్రిక్‌బజ్ షోలో ప్రత్యేకంగా మాట్లాడిన అంబటి రాయుడు అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'శ్రేయస్ అయ్యర్ ఎప్పుడూ సూపర్ ఫామ్‌లోనే ఉంటాడు. అతనిలాంటి ప్రపంచస్థాయి ఆటగాడిని కొందరు విమర్శించడం చూస్తే నాకు నవ్వు వస్తుంది. అతను రాణించిన ప్రతీ సారి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.
అతను ప్రధాన బౌలర్లనే ఎదుర్కొంటాడు. ఇన్నింగ్స్ ఆసాంతం తడబడుతూ.. చివర్లో బౌండరీలు బాది జట్టుకు నష్టం చేసే రకం కాదు. తన బ్యాటింగ్‌తో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇన్నింగ్స్ మొత్తాన్ని తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు. అందుకే అతను ఒక అద్భుతమైన, అమోఘమైన బ్యాటర్.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో (43 బంతుల్లో 102 నాటౌట్) అజేయ శతకంతో రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత వరుసగా 8 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో హాఫ్ సెంచరీ బాది ఈ పేలవ రికార్డ్‌కు తెరదించాడు. భారత టీ20 సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు.
ఆఖరి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(32 బంతుల్లో 5 ఫోర్లు,5 సిక్స్‌లతో 61), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆడమ్ మిల్నే(4/19) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.
అనంతరం న్యూజిలాండ్ 18 ఓవర్లలోనే 3 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. టీమ్ సీఫెర్ట్(50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 93), గ్లేన్ ఫిలిప్స్(39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
