న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్‌ ఉపసంహరణ: మళ్లీ వైట్ బాల్ క్రికెట్‌లోకి అంబటి రాయుడు

Ambati Rayudu Eager To Make A Comeback To White-Ball Cricket || Oneindia Telugu
Ambati Rayudu eager to make a comeback to white-ball cricket

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాడని తెలుస్తోంది. ఈ ఏడాది వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో ఆవేదనకు గురై, గత జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.

<strong>వరల్డ్ చాంపియన్‌షిప్‌: 36 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్</strong>వరల్డ్ చాంపియన్‌షిప్‌: 36 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్

రిటైర్మెంట్‌ ఉపసంహరణ

రిటైర్మెంట్‌ ఉపసంహరణ

అయితే, తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్టు అంబటి రాయుడు తెలిపాడు. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌‌తో పాటు ఐపీఎల్ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు.

వరల్డ్‌కప్ కోసం 4,5 ఏళ్లు తీవ్రంగా శ్రమించా

వరల్డ్‌కప్ కోసం 4,5 ఏళ్లు తీవ్రంగా శ్రమించా

రాయుడు మాట్లాడుతూ "వరల్డ్‌కప్ కోసం 4,5 ఏళ్లు తీవ్రంగా శ్రమించా. అయినా జట్టులో చోటు లభించకపోతే నిరాశ చెందడం సహజం. అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత మళ్లీ ఆలోచించా. తిరిగి భారత్‌ తరపున ఆడాలని తపిస్తున్నా" అని అన్నాడు.

PKL 2019: గులియా సూపర్-10, ఆరు ఓటముల తర్వాత విజయం

గత రెండేళ్లుగా నిలకడగా

గత రెండేళ్లుగా నిలకడగా

గత రెండేళ్లుగా టీమిండియా తరఫున నిలకడగా ఆడిన రాయుడిని ఎమ్మేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదు. రాయుడి స్థానంలో విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు. దీంతో ప్రపంచకప్‌ను వీక్షించేందుకు ‘3డీ' కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ట్వీట్‌ చేశాడు.

రాయుడికి బదులు మయాంక్ అగర్వాల్

రాయుడికి బదులు మయాంక్ అగర్వాల్

రాయుడు చేసిన ఈ ట్వీట్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అనంతరం వరల్డ్‌కప్‌లో టోర్నీలో శిఖర్‌ ధావన్‌, విజయ్ శంకర్‌ గాయపడ్డా బ్యాకప్‌గా ఉన్న రాయుడిని ఎంపిక చేయకుండా అతడి స్థానంలో మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు.

Story first published: Saturday, August 24, 2019, 8:29 [IST]
Other articles published on Aug 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X