IPL బ్రాడ్‌కాస్ట్ రైట్స్ రేసులో బడా కంపెనీలు జియో, అమెజాన్.. రూ.50 వేల కోట్లు పలికే చాన్స్!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బ్రాడ్‌కాస్ట్ రైట్స్‌తో మరోసారి భారీ మొత్తం రాబట్టేందుకు (భారత క్రికెట్ నియంత్రణ మండలి) బీసీసీఐ సిద్దమైంది. 2023-2027 మధ్య ఐదేళ్ల కాలానికి సంబంధించిన బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ అమ్మకం ద్వారా కనీసం రూ. 50 వేల కోట్లు ఖాతాలో వేసుకోవాలని బోర్డు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 2018లో ప్రారంభమైన స్టార్ ఇండియా నెట్‌వర్క్ కాంట్రాక్ట్ ఈ ఏడాదితో ముగిసిపోనుంది. ఇందుకుగానూ బీసీసీఐ రూ.16,348 కోట్ల ఆదాయాన్ని అందుకుంది.

రేసులోకి రిలయన్స్..
ఇక ప్రస్తుతం ఐదేళ్ల కోసం బీసీసీఐ బిడ్డింగ్స్ ఆహ్వానించింది. స్టార్ నెట్ వర్క్, సోనీ నెట్‌వర్క్‌తో పాటు ఇప్పటికే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పోటీ పడుతుంది. ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు రిటైల్ రంగంలో రిలయన్స్‌కు తీవ్ర పోటీనిస్తున్న అమెజాన్ కూడా ఐపీఎల్ టెలికాస్ట్ రైట్స్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
వందల మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఐపీఎల్ టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల కోసం వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.50 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు ఈ బడా కంపెనీలు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ పోటీలు జరుగుతాయి.

స్టార్‌కు గట్టి పోటీ..
గతేడాది ఐపీఎల్ మొదటి ఫేజ్‌లో దాదాపు 350 మిలియన్ల వ్యూస్‌ను చేరుకోవడం విశేషం. వచ్చే ఐదేళ్ల కోసం స్టార్ నెట్‌వర్క్‌కు రిలయన్స్, అమెజాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది. ‘ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడ. దాదాపు 250 కోట్ల మంది అభిమానులు క్రికెట్‌ను ఆదరిస్తున్నారు. ఇలాంటి ఆటకు ఐపీఎల్ సూపర్ బౌల్ లాంటిది'' అని ఓ బెట్టింగ్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. జియో డిజిటల్ ప్లాట్‌ఫామ్ విస్తరణ కోసం ఐపీఎల్ ప్రసార హక్కుల బిడ్‌ను రిలయన్స్ దక్కించుకోవడం ఎంతో కీలకమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రత్యేక స్పోర్ట్ చానెల్‌తో..
గత కొన్ని నెలలుగా రిలయన్స్ అనుబంధ మీడియా సంస్థ Viacom18లో జరుగుతున్న వ్యవహారాలు, స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ హక్కుల కొనుగోలు, ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఛానెల్‌ను ఏర్పాటు చేయడం వంటివన్నీ దీనికి సంకేతాలుగా తెలుస్తోంది. మరోవైపు ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రారంభించిన అమెజాన్ కూడా ఐపీఎల్ హక్కులను సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది.
దీనివల్ల ప్లాట్‌ఫామ్ యూజర్లను గణనీయంగా పెంచుకోవాలనేది అమెజాన్ ప్రణాళిక. అయితే అమెజాన్‌కు టీవీ ప్లాట్‌ఫామ్ లేకపోవడం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. టీవీ పార్టనర్‌నైనా కలుపుకొని బిడ్‌కు దాఖలు చేయాలి లేదా కేవలం డిజిటల్ విభాగం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications