Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారెవ్వా వాటే కో ఇన్సిడెన్స్.. 11కు విరాట్‌ కోహ్లీకి విడదీయని బంధం!

Amazing Coincidence: Virat Kohli Bond with Number 11

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయిన విషయం తెలిసిందే. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ సోమవారం(జనవరి 11) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కోహ్లీకి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయింది. అదేంటంటే.. 11 అనే అంకేకు విరాట్ కోహ్లీ విడదీయని బంధం ఉందంట! అవును భారత కెప్టెన్ పుట్టిన నెల, పెళ్లి రోజు, తండ్రైన రోజు, కెరీర్‌లో సాధించిన ఘతనలన్నిటీ 11తో సంబంధం ఉండటం ఇప్పడు చర్చనీయాంశమైంది.

విరాట్ కోహ్లీ బర్త్‌డే 11వ నెల అయిన నవంబర్ 5.. అనుష్కశర్మతో పెళ్లి డిసెంబర్ 11న పెళ్లయింది. జనవరి 11న కూతురు పుట్టింది. ఓ క్యాలండర్ ఇయర్‌లో 11 సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్ కోహ్లీనే. అంతేకాకుండా అప్‌కమింగ్ టీ20 వరల్డ్ కప్.. కోహ్లీ కెరీర్‌లో 11వ ఐసీసీ టోర్నమెంట్. దాంతో విరాట్ కోహ్లీకి 11వ నంబర్‌కు విడదీయని బంధం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక తమకు కూతురు పుట్టిన విషయాన్ని కోహ్లీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. 'ఈ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టింది. ఈ సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాం. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ కోహ్లీ'అని విరాట్ ట్వీట్‌ చేశాడు.

Story first published: Monday, January 11, 2021, 18:16 [IST]
Other articles published on Jan 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+