అది దురదృష్టం కాదు.. నీ బద్దకం! హర్మన్‌ప్రీత్ రనౌట్‌పై అలిస్సా హీలీ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరోసారి టీమిండియాకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత ప్లేయర్లు చేజేతులా చేజార్చుకున్నారు. చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్నారు. అయితే కీలక సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌటవ్వడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే ఈ రనౌట్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. దురదృష్టవశాత్తు రనౌటయ్యానని హర్మన్ ప్రీత్ కన్నీటి పర్యంతమైతే.. స్కూల్ గర్ల్ మిస్టేక్ అంటూ కొందరు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.
బ్యాడ్ లక్ కంటే బద్దకమే..
బ్యాట్ స్ట్రక్ అవ్వడంతోనే పరుగు పూర్తి చేయలేకపోయానని విమర్శలకు హర్మన్ ప్రీత్ ధీటుగా బదులిచ్చింది. తాజాగా ఈ రనౌట్ చేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అది దురదృష్టం అనడం కంటే హర్మన్‌ప్రీత్ బద్దకమని చెప్పొచ్చని ఘాటుగా విమర్శించింది. 'హర్మన్‌ప్రీత్ రనౌట్ విషయంలో దురదృష్టం కంటే బద్ధకమే ఎక్కువగా కనిపిస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇలా జరిగింది? అలా జరిగిందని చాలా చెప్పవచ్చు. కానీ ఆమె సరిగ్గా ప్రయత్నించి ఉంటే క్రీజు ధాటేది. ఆ రెండు మీటర్లు ధాటేందుకు పూర్తిగా ఎఫర్ట్ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఆ తప్పిదాన్ని వాడుకున్నాం..
ఆమె అలసత్వాన్ని మా జట్టు క్యాష్ చేసుకుంది. జీవితంలో జరిగిన ప్రతీ దానికి దరిద్రం, బ్యాడ్‌లక్ అని చాలా చెప్పుకోవచ్చు. కానీ ఆ సమయంలో మనం ఎంతలా ప్రయత్నించాం, గెలవడానికి ఎంత వరకూ కష్టపడ్డామనేది కూడా ముఖ్యం. ఒకసారి మైదానంలోకి బరిలోకి దిగామంటే పూర్తి శక్తిని ఉపయోగించాలి. పూర్తి ఎఫర్ట్స్ పెట్టాలి. ఆమె ఔటవ్వకుండా ఉండాలని భావిస్తే.. బంతి రావడం గమనించే డైవ్ చేయాల్సింది. ఈజీగా పరుగు తీస్తానని రిలాక్స్ అయిపోయి మూల్యం చెల్లించుకుంది. ఈ తప్పిదాన్ని వాడుకొని మేం విజయం సాధించాం.

ఆమె అలసత్వాన్ని గ్రహించే..
వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి. చిన్న చిన్న తప్పిదాలు ప్రత్యర్థికి కలిసి వస్తాయనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి బిగ్ టోర్నీలు గెలవాలంటే ఏ చిన్న తప్పు కూడా చేయకూడదు. వాస్తవానికి ఈ తరహా సందర్భాలు ఎదురైనప్పుడు నేను స్టంప్స్‌ను పడేసి సమయాన్ని వృథా చేయను. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ అలసత్వాన్ని గ్రహించే స్టంప్స్‌కి బంతిని కొట్టాను.'అని అలిస్సా హిలీ చెప్పుకొచ్చింది. సౌతాఫ్రికాతో మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్లో ఆసీస్ అమీతుమీ తేల్చుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications