Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న ఐపీఎల్ ఛాంపియన్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఛాంపియన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ కారణంతోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ టీమ్ నుంచి తప్పుకున్నాడు. ఈ మెగా ఫైనల్‌కు ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఆలిండియా సెలెక్షన్ కమిటీ అవకాశం ఇచ్చింది.

అయితే తన వివాహం ఉందని, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండనని రుతురాజ్ గైక్వాడ్ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దాంతో అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయగా.. అతను లండన్ వెళ్లి కోహ్లీతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Utkarsha Pawar

ఇక జూన్ 2-3 తేదీల్లో రుతురాజ్ గైక్వాడ్ తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్కర్ష పవార్ కూడా క్రికెటరే. పూణేకు చెందిన ఉత్కర్ష పవార్, మహారాష్ట్ర తరుపున దేశవాళీ క్రికెటర్‌గా రాణిస్తోంది. కుడి చేతి బ్యాటర్ అయిన ఉత్కర్ష, రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.

అక్టోబర్ 13, 1998లో పుట్టిన ఉత్కర్ష పవార్, 11 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడుతోంది. పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్స్‌లో చదువుకుంటోంది. ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ తమ కెప్టెన్ ధోనీతో కలిసి ఓ ఫొటో దిగాడు. ఈ ఫొటోలో ఐపీఎల్ ట్రోఫీతో పాటు తనకు కాబోయే సతీమణి ఉత్కర్ష పవార్ కూడా ఉంది.

ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న రుతురాజ్ గైక్వాడ్.. 'నా జీవితంలో ఇద్దరు వీవీఐపీలు.'అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ఫొటోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకే కులమని, అది క్రికెట్ కులమని ఆటపట్టిస్తున్నారు. క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో ప్రేమించుకున్నారా? అని ఆటపట్టిస్తున్నారు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. తాజా ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ 590 పరుగులు చేసి చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సహచర ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కీలకమైన ఫైనల్లోనూ ఈ ఇద్దరు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

Story first published: Wednesday, May 31, 2023, 20:35 [IST]
Other articles published on May 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+