Royal Challengers Bangalore కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ!

హైదరాబాద్: టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వేటుకు గురైన విరాట్ కోహ్లీ .. ఐపీఎల్ 2022 సీజన్‌లో మళ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టును నడిపిస్తాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందు కెప్టెన్‌గా ఇదే తనకు చివరి సీజన్ అని, వచ్చే ఏడాది కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. వర్క్‌లోడ్‌ను సమన్వయం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఐపీఎల్‌లో తన కెరీర్ చివరి మ్యాచ్ వరకు ఆర్‌సీబీ జట్టులోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు.

కెప్టెన్ కోసం వేట..
అన్నట్లుగానే రూ.2 కోట్లు తక్కువ ఇచ్చినా ఆర్‌సీబీ రిటెన్షన్‌కు ఒప్పుకొనున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో ఆర్‌సీబీ ముగ్గురు ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. విరాట్ కోహ్లీని ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా రూ.15 కోట్లకు, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.12 కోట్లు, మహమ్మద్ సిరాజ్‌కు రూ.7 కోట్లకు తీసుకుంది. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంతో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ఎంచుకునే ప్రయత్నంలో ఉంది. కర్ణాటకకే చెందిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఆ ఫ్రాంచైజీ కన్నేసింది.

కోహ్లీని ఒప్పించేందుకు..
అయితే భారత క్రికెట్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ విరాట్ కోహ్లీనే తమ కెప్టెన్‌గా నియమించకునేందుకు ఆ ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ కూడా మళ్లీ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు అందుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి 2023 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ.. ఆ క్రమంలోనే తనపై నెలకొన్న పనిభారాన్ని తగ్గించుకునేందుకు ఆర్‌సీబీ కెప్టెన్సీతో పాటు టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసింది.

ఫ్యాన్స్ సైతం..
దాంతో కోహ్లీ ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. వన్డే, టీ20 కెప్టెన్సీ కోల్పోవడంతో ఇప్పుడు విరాట్ కోహ్లీకి కావాల్సినంత సమయం దొరుకుతుంది. పైగా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని విరాట్ అవమానంగా భావిస్తున్నాడని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. కోహ్లీకి చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా.. వాటిని నమ్మే పరిస్థితిల్లో అభిమానులు లేరు. కాబట్టి విరాట్.. ఆర్‌సీబీ పగ్గాలు అందుకొని సత్తా చాటాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ప్రతీసారి టీమ్‌లో సరైన ఆటగాళ్లు లేకనే విఫలమయ్యే ఆర్‌సీబీ.. ఈ సారి వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకొవాలని సూచిస్తున్నారు. బీసీసీఐ చెంప చెళ్లుమనేలా టైటిల్ గెలవాలని కోరుతున్నారు.

నాయకుడు.. పోరాట యోధుడు..
ఇక టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ను తొలగించడాన్ని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సైతం సహించలేకపోయింది. ఈ నిర్ణయం వెల్లడించిన వెంటనే తమ మాజీ కెప్టెన్‌కు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో పరోక్షంగా బీసీసీఐ, రోహిత్ శర్మలను తప్పుబట్టింది. 'నాయకుడు.. పోరాట యోధుడు.. స్పూర్తి ప్రదాత.. ఈ మూడు కలగలిపిన వ్యక్తే కింగ్ కోహ్లీ'పోస్ట్ చేసిన ఆర్‌సీబీ... భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్ నువ్వే అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. భవిష్యత్తులో వచ్చిన సారథులు కూడా నీ సారథ్యాన్ని టెంప్లెట్‌గా వాడాల్సిందేనని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications