Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్.. అధికారికంగా ప్రకటించిన ఈసీబీ!

All rounder Ben Stokes named England new Test captain

న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లుగానే ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ టెస్ట్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. ఇంతకాలం జట్టును నడిపించిన జోరూట్ సారథ్య బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకోవడంతో అతని వారసుడిగా ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఈసీబీ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్ పురుషుల టీమ్ కొత్త మేనేజింగ్ డైరక్టర్ రాబ్ కీ.. కొత్త టెస్ట్ సారథిగా బెన్ స్టోక్స్ పేరు రికమెండ్ చేయగా.. ఈసీబీ ఆమోదం తెలిపింది. దాంతో 81వ సారథిగా బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకోనున్నాడు.

బెన్‌ స్టోక్స్‌కు టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు నేను పెద్దగా ఆలోచించలేదు. భవిష్యత్తులో ఇంగ్లండ్‌ జట్టును విజయ పథంలో స్టోక్స్‌ నడిపిస్తాడన్న నమ్మకం మాకు ఉంది. అదే విధంగా ఇంగ్లండ్‌ సారథిగా బాధ్యతలు చేపట్టేందుకు అతడు అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇం‍గ్లండ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అతడే సరైనోడు" అని రాబ్‌ కీ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.

ఇక టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. ఇక స్టోక్స్ 2013లో టెస్టుల్లో అరంగేట్రంచేశాడు. ఇప్పటి వరకు 73 టెస్టులో ఇం‍గ్లండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా స్టోక్స్ ఎంపికయ్యాడు. 2020లో జోరూట్ పెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు స్టోక్స్ ఒక మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించాడు. ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడిన స్టోక్స్ 5,061 పరుగలతో పాటు.. 174 వికెట్లు పడగొట్టాడు.

జో రూట్‌ కొద్ది రోజుల కిందటే తన టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. యాషెస్‌ సిరీస్‌లో పరాభవం, వెస్టిండీస్‌ పర్యటనలో ఓటమికి బాధ్యత వహిస్తూ అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 5 సంవత్సరాల పాటు రూట్.. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 64 టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యాన్ని వహించాడు జో రూట్. 27 మ్యాచ్‌లల్లో జట్టును గెలిపించాడు. 5,295 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

జో రూట్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో 1-0 తో ఇంగ్లండ్ సిరీస్ ఓడింది. ఆస్ట్రేలియా చేతిలో యాషెష్ సిరీస్ వైట్ వాష్‌కు గురైంది. ఈ రెండు ఘోర పరాభవాలు అతని కెప్టెన్సీకి ఎసరు పెట్టాయి. తీవ్ర విమర్శలు చెలరేగడంతో కెప్టెన్సీని వదులుకున్నాడు.

Story first published: Thursday, April 28, 2022, 16:55 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+