Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK: చెన్నై ఆటగాళ్లకి కరోనా నెగటివ్.. లీగ్ తొలి మ్యాచ్‌లో ముంబైతోనే ఢీ!!

All Chennai Super Kings players has been tested negative for COVID-19, likely to play IPL 2020 opener against Mumbai Indians
IPL 2020 : Chennai Super Kings Players Test Negative For Covid-19 || Oneindia Telugu

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) అభిమానులకు శుభవార్త. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టులో సీఎస్‌కే ఆటగాళ్లు అందరికి (క్వారంటైన్‌లో ఉన్నవారు తప్ప) నెగటివ్ వచ్చింది. గత వారం ఇద్దరు చెన్నై ఆటగాళ్లతో (దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ) పాటు ఆ టీమ్‌లోని 11 మంది స్టాఫ్ కరోనా వైరస్ బారినపడగా.. తాజాగా రెండోసారి నిర్వహించిన టెస్టులో చాహర్‌, రుతురాజ్‌ తప్ప మిగతావారికి నెగటివ్ వచ్చింది. ఇటీవలే యూఏఈ చేరుకున్న డుప్లెసిస్, ఎంగిడి క్వారంటైన్‌లో ఉన్నారు. గత 10 రోజలుగా సతమవుతున్న సీఎస్‌కేకు ఇది మంచి ఉపశమనం కలిగించే వార్తనే చెప్పాలి.

13 మందికి కరోనా:

13 మందికి కరోనా:

యూఏఈలో ఐపీఎల్‌ 2020 కోసం అన్ని ప్రాంఛైజీలు తమ ఆటగాళ్లను అప్రమత్తం చేశాయి. వారిని ప్రత్యేకంగా ఉంచుతూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే సీఎస్‌కే సైతం చెపాక్‌లో ప్రత్యేక ఫిట్‌నెస్‌ శిబిరం నిర్వహించింది. సరిగ్గా దుబాయ్‌కు వెళ్లే ముందు ఐదు రోజుల పాటు ఏర్పాటు చేసింది. అందుకోసం బయోబుడగ వాతావరణం కూడా సిద్ధంచేసింది. ఇక ఆగస్టు 21న ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు వెళ్లింది. అయితే అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందికి వైరస్‌ సోకినట్లు తేలింది.

నేటి నుంచి ప్రాక్టీస్:

నేటి నుంచి ప్రాక్టీస్:

చెన్నై ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్‌ 2020 పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కేను మరోవారం రోజులు క్వారంటైన్‌కు తరలించారు. గత సోమవారం అందరికీ పరీక్షలు నిర్వహించారు. స్పష్టత కోసం గురువారం మరోసారి పరీక్షలు నిర్వహించారు. అందులో చాహర్‌, రుతురాజ్ లకు మినహా మిగతావారందరికి నెగటివ్ అని తేలింది. దీంతో ధోనీసేన నేటి నుంచి ప్రాక్టీస్‌ మొదలుపెట్టనుంది. ఇక డుప్లెసిస్, ఎంగిడి క్వారంటైన్‌ ముగిసిన అనంతరం జట్టులో కలవనున్నాడు.

తొలి మ్యాచ్‌ ముంబైతోనే:

తొలి మ్యాచ్‌ ముంబైతోనే:

అన్ని సవ్యంగా సాగుతున్న నేపథ్యంలో సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య లీగ్ తొలి మ్యాచ్ జరగడం ఖాయమైంది. సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్‌, రన్నరప్‌ జట్ల మధ్య లీగ్ తొలి మ్యాచ్ జరగడం ఆనవాయితీ. దాంతో ఐపీఎల్ 2019 విజేత ముంబై, రన్నరప్‌‌ చెన్నై మధ్య ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభ మ్యాచ్ జరిగేలా బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించింది. అయితే చెన్నై జట్టులో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. సెప్టెంబరు 19 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని బీసీసీఐ గతవారం పునరాలోచనలో పడింది. ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ నిర్వహించాలని కూడా ప్రణాళిక రూపొందించింది. అయితే చెన్నై వారం రోజుల్లో కోలుకోవడంతో.. లీగ్ ఆనవాయితీ ప్రకారమే తొలి మ్యాచ్ జరగనుంది.

'సౌరవ్ గంగూలీ ఆసక్తి చూపినా.. ఆ టూర్‌కు ఎంఎస్ ధోనీ ఎంపికవలేదు'

Story first published: Friday, September 4, 2020, 16:13 [IST]
Other articles published on Sep 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+