For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 మెగావేలంలో మెరిసిన బ్యూటీ.. కళ్లతోనే కట్టిపడేసింది!

All about Juhi Chawlas daughter Jahnavi Mehta who attended IPL 2022 auction

బెంగళూరు: అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2022 సీజన్ వేలం.. క్రికెట్ మ్యాచ్‌ల మాదిరి అసలు సిసలు మజాను పంచింది. కొందరు ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయితే మరికొందరూ పాతాళానికి పడిపోయారు. స్టార్లు అనుకున్న వాళ్లలో చాలా మంది అమ్ముడుపోని జాబితాలో మిగిలిపోయారు. అయితే మెగా వేలం జరుగుతున్నంత సేపు టీవీ కెమెరాలు ఓ ఇద్దరిని పదే పదే చూపించాయి. అందులో ఒకరు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కాగా.. మరొకరు 19 ఏళ్ల అమ్మాయి. కావ్య పాప గురించి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్‌ను తలిపించే ఆమెపై చాలా మంది అభిమానులు మనసు పారేసుకున్నారు.

All about Juhi Chawlas daughter Jahnavi Mehta who attended IPL 2022 auction

అయితే ఆమెతో పాటు ఉన్న మరో అమ్మాయి కూడా ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పెద్దగా అందంగా లేకపోయినప్పటికి తన కళ్లతో కట్టిపడేసింది. తన అభినయంతో చూపు తిప్పుకోకుండా చేసింది. చిరునవ్వులు చిందుస్తూ వేలంలో అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంది. అయితే అభిమానులను ఇంతగా ఆకట్టుకున్న ఆ సుందరి ఎవరంటే? కోల్‌కతా నైట్‌రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా తనయ జాహ్నవి మెహ్తా.

All about Juhi Chawlas daughter Jahnavi Mehta who attended IPL 2022 auction

కోల్‌క‌తా త‌ర‌ఫున షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్‌ఖాన్‌, కుమార్తె సుహానాల‌తో క‌లిసి జూహీ చావ్లా త‌న‌యురాలు జాహ్న‌వి మెహ్తా వేలంలో పాల్గొంది. వారిద్ద‌రికంటే కాస్త క‌ల‌ర్ త‌క్కువే అయినా.. చామ‌న‌చాయ రంగులో ఈమె అందంగా క‌నిపించింది. రెండేళ్ల క్రితం జ‌రిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పాల్గొన్పటికీ.. ఇప్పుడు అభిమానులకు తెగ నచ్చేసింది. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఆమె చార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోక‌స్ చేశాయి. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసివ‌చ్చి.. ప్ర‌స్తుతం కేకేఆర్ టీమ్ వ్య‌వ‌హారాలు చూసుకుంటుంది.

జాహ్నావి పుస్తకాల పురుగుని, విపరీతంగా బుక్స్ చదువుతుందని ఆమె తల్లి జూహీ చావ్లా తెలిపింది. ఏ కెరీర్ ఎంచుకుంటావని ప్రశ్నిస్తే ఓ రోజు రైటర్ అవుతానని చెబుతుందని, మరొకరోజు మోడల్ అవుతానంటుందని పేర్కొంది. ఇంకోరోజు స్పోర్ట్స్ టీమ్ వ్యవహరాలు చూసుకుంటానని చెబుతుందని, ఆమె ఇష్టం వచ్చింది చేస్తానంటే ఎంకరేజ్ చేయడమే తమ పనని జూహీ చావ్లా పేర్కొంది.

Story first published: Tuesday, February 15, 2022, 15:38 [IST]
Other articles published on Feb 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+