Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli vs Rohit Sharma: పాపం అలియా భట్.. కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ చేతిలో రోస్ట్!

Alia Bhatt trolled for revealing her favourite cricketer between Virat Kohli and Rohit Sharma

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చిక్కుల్లో పడింది. ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అలియా భట్‌ను కష్టాల్లో పడేసింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌ ఎదుర్కొంటుంది. అంతగా అలియాను ఇబ్బందుల్లోకి నెట్టిన ఆ ప్రశ్న ఏంటంటే..? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో ఫేవరేట్ క్రికెట్ ఎవరనేది. దీనికి అలియా చాలా తెలివిగా సమాధానం చెప్పినా.. అభిమానుల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఫేవరటని, విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ ఫేవరేట్ అని ఇద్దరి అభిమానుల మనసులను నొప్పించుకుండా అలియా భట్ సమాధానమిచ్చినా.. ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దాంతో సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్ హీరోయిన్‌ను అభిమానులు ఏకిపారేస్తున్నారు.

విరాట్ x రోహిత్..

ఈ తరం క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ గొప్ప క్రికెటర్లు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత క్రికెట్‌కు వారు అందిస్తున్న సేవలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మైదానంలో పరుగుల మోత మోగించే కోహ్లీ.. రన్ మిషన్‌గా అభిమానుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకోగా.. విధ్వంసకర బ్యాటింగ్‌తో రోహిత్ హిట్ మ్యాన్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. సినిమా హీరోలను మించిన అభిమానగణం వీరి సొంతం.

ఇద్దరి ఫ్యాన్స్ రచ్చ రచ్చ..

ఎంతలా అంటే సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు దూషించుకునేంత పిచ్చ అభిమానం. మైదానంలో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు స్నేహితులుగానే ఉన్నా.. అభిమానులు మాత్రం అలా ఉండలేకపోతున్నాడు. గత రెండు మూడేళ్లుగా ఇది చాలా ఎక్కువైంది. ప్రతీ విషయంలో ఈ ఇద్దరి ఆటగాళ్లను సరిపోల్చుతూ పోటా పోటీగా పోస్ట్‌లు పెడుతుంటారు. ఈ క్రమంలోనే అభిమానుల వైర్యాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరూ.. ఈ ఇద్దరి మధ్య విభేధాలున్నాయనే పుకార్లను సృష్టిస్తున్నారు. వీటిపై కోహ్లీ ఇప్పటికే చాలా సార్లు స్పష్టత ఇచ్చినా.. ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

అలియాపై ట్రోల్స్..

అయితే ఇప్పుడు ఆ సెగే అలియా భట్‌కు తగిలింది. విరాట్ కోహ్లీని ఆల్‌టైమ్ ఫేవరేట్ క్రికెటర్? అని ఎలా అంటావు అని అతని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇంకా క్రికెట్ ఆడుతున్నాడని, అతనే ఫేవరేట్ అని చెప్పాల్సిందని కామెంట్ చేస్తున్నారు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడే రోహిత్ ఫేవరేట్ క్రికెటరా? అంటూ హేళన చేస్తున్నారు. ఇంకొందేరేమో అసలు అలియాకు క్రికెట్ గురించే తెలియదంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్‌‌టాపిక్‌గా మారింది.

గంగూబాయిగా అలియా..

గంగూబాయిగా అలియా..

ఇక గ్లామర్ రోల్స్​తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ అలియా భట్ దూసుకెళ్తోంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గంగూబాయి కతియావాడి' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఇందులో వేశ్య పాత్ర పోషించిన అలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రముఖ బీటౌన్​ డైరెక్టర్​ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్​ దేవగణ్​, ఇమ్రాన్​ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్​లో తెరకెక్కిన 'ఆర్​ఆర్​ఆర్'​లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Sunday, February 27, 2022, 17:47 [IST]
Other articles published on Feb 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+