Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌లో పుట్టి.. అమెరికాకు ఆడి.. ఇప్పడు ఐపీఎల్‌కు!!

Ali Khan the first US cricketer to play in IPL, a know all about him story

హైదరాబాద్: ప్రపంచంలోని టీ20 లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ది మొదటి స్థానం. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు కూడా కోరుకుంటారు. ఐపీఎల్‌లో ఒక్క అవకాశం వస్తే బాగుండని కోరుకోని క్రికెటర్‌ ఉండడు. ఇక యువ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడి సత్తాచాటి.. జాతీయ జట్లలో ఆడాలని ఎదురుచూస్తుంటారు.

ఇక అమెరికా లాంటి దేశం నుంచి ఒక ఆటగాడు‌ ఐపీఎల్‌కు ఎంపికకావడం అంటే చిన్న విషయం మాత్రం కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి. ప్రతిభ ఉన్నా.. వచ్చిన ఒకటి రెండు అవకాశాల్లోనే తనను తాను నిరూపించుకోవాలి. ఇదే చేశాడు మహమ్మద్‌ అసన్‌ అలీఖాన్‌. పాకిస్థాన్‌లో పుట్టిన అలీఖాన్‌.. ఐపీఎల్‌కు ఎలా ఎంపికయ్యాడో ఓసారి చూద్దాం.

2016 నుంచి అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం

2016 నుంచి అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం

అలీఖాన్‌ పుట్టింది పాకిస్థాన్‌లోని పంజాబ్‌ నగరంలో. 18 ఏళ్ల వరకు అక్కడే ఉన్నాడు. ఆపై కుటుంబంతో సహా అమెరికాలోని ఒహియోకు వెళ్ళిపోయాడు. 2013 నుంచి ఆల్ స్టార్స్ జట్టు కోసం ఆడటం ప్రారంభించాడు. కొన్ని అద్భుత ప్రదర్శనలతో 2016 నుంచి అమెరికా జాతీయ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కుడి చేతివాటం గల ఈ 29 ఏళ్ల క్రికెటర్‌ 27.13 సగటుతో 38 వికెట్లు తీశాడు. 2019 ఏప్రిల్‌లో పపువా న్యూగినియా వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. బంతిని వేగంగా వేయడం అలీ ప్రత్యేకత.

12 మ్యాచుల్లో 16 వికెట్లు

12 మ్యాచుల్లో 16 వికెట్లు

2018లో జరిగిన కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో అలీఖాన్‌ రాణించాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో దృష్టిని ఆకర్షించాడు. బ్రావో అండతో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌)లో అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం గయానా అమేజాన్‌ వారియర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 12 మ్యాచుల్లోనే 16 వికెట్లు తీసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. సీజన్‌లోనే రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

గార్నీ గాయం కలిసొచ్చింది

గార్నీ గాయం కలిసొచ్చింది

2019లో బాలీవుడ్ హీరో షారుక్‌ ఖాన్‌ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ అలీఖాన్‌ను సొంతం చేసుకుంది. ఆ ఏడాది బాగానే ఆడాడు. ఇక సీపీఎల్ 2020లో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 7.43 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. ట్రిన్‌బాగో టైటిల్‌ విజేతగా నిలుపడంలో తనవంతు పాత్ర పోషించాడు. సీపీఎల్‌ ప్రదర్శనతో ఫ్రాంచైజీని విశేషంగా ఆకర్షించాడు. కోల్‌కతా బౌలర్‌ హ్యారీ గార్నీ భుజం గాయంతో టోర్నీకి దూరం కావడంతో.. యాజమాన్యం వెంటనే అలీఖాన్‌కు అవకాశం కల్పించింది. గార్నీ గాయం మనోడికి కలిసొచ్చిందనే చెప్పాలి. అలా పాకిస్థాన్‌లో పుట్టి.. అమెరికాకు ఆడి.. ఇప్పడు ఐపీఎల్‌లో ఆడనున్నాడు. ఈ రోజు ముంబైతో కోల్‌కతా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. తుది జట్టులో అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టుకు ఎంపికైన విషయం తెలిశాక ఉద్వేగానికి లోనై ఏడ్చేశానని అలీఖాన్‌ చెప్పాడు. 'చరిత్రలోనే తొలిసారిగా అమెరికా నుంచి ఓ క్రికెటర్‌ మన ఐపీఎల్‌లో భాగం కాబోతున్నాడు అని కోల్‌కతా కోచ్‌ బ్రెండన్‌ మొక్కల్లమ్‌ చెప్పిన మాటలు.. ఇంకా నా మదిలో వినిపిస్తున్నాయి. ఇదంతా నిజమేనా అని ఇప్పటికీ సందేహం కలుగుతోంది. ఆ రోజంతా ఆ విషయమే ఆలోచిస్తూ ఉండిపోయా. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత మెక్కల్లమ్‌ నా దగ్గరికి వచ్చి నువ్వు దీనికి అర్హుడివి అని అన్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని నేనూ మాటిచ్చా' అని అలీఖాన్‌ తెలిపాడు.

RR vs CSK: అరంగేట్ర మ్యాచ్‌లోనే గోల్డెన్‌ డక్‌ అయిన చెన్నై బ్యాట్స్‌మన్‌!!

Story first published: Wednesday, September 23, 2020, 15:35 [IST]
Other articles published on Sep 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+