
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. సర్రే జట్టు తరఫున జూన్‌లో కౌంటీల్లో అడుగుపెట్టబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కోహ్లీకి ఇది వార్మప్‌లా ఉపయోగపడనుంది. కోహ్లీ తమ జట్టుతో చేరుతున్నాడని సర్రే యాజమాన్యం గురువారం అధికారిక ప్రకటన చేసింది.
విరాట్ కోహ్లీకి వెల్‌కమ్ పలుకుతూ సర్రే క్లబ్ తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. సర్రే క్లబ్ తరుపున విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ ఆడనున్నాడు. ఇప్పటికే భారత్ తరఫున ఛటేశ్వర్ పుజారా (యార్క్‌షైర్), ఇషాంత్ శర్మ (ససెక్స్), వరుణ్ ఆరోన్ (లిసెస్టర్‌షైర్) తరఫున కౌంటీల్లో ఆడుతున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
వన్డే కప్‌లో భాగంగా రాయల్ లండన్‌లో మిడిల్‌సెక్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ జూన్ నెల మొత్తం సర్రే జట్టు తరఫున ఆడనుండటంపై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ అలెగ్జెండ్రా హార్ట్‌లీ తెగ సంతోష పడిపోతోంది.
'వావ్.. వెల్‌కమ్ టూ యూకే కోహ్లీ. సర్రే తరఫున ఆడబోతుండటాన్ని నమ్మలేకపోతున్నా. వెల్‌కమ్ కోహ్లి' అంటూ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ప్రపంచ క్రికెట్‌లోని అత్యత్తుమ ఆటగాడితో ఒప్పందం కుదరడం తనను థ్రిల్‌కు గురిచేసిందని సర్రే డైరెక్టర్ అలెక్ స్టివార్ట్ పేర్కొన్నాడు.

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన విరాట్ కోహ్లీతో ఆడుతూ శిక్షణ తీసుకోవడం తమ ఆటగాళ్లకు ఎంతో కలిసొస్తుందని అలెక్ స్టివార్ట్ పేర్కొన్నాడు. ఈ అవకాశాన్ని తమ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ అంటే ఎంతగానో అభిమానం చూపే అలెగ్జెండ్రా.. ఐపీఎల్‌లో కోహ్లీ నాయకత్వంలోని ఆర్‌సీబీకి సపోర్ట్ చేస్తోంది.