Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తాతనా మజాకా.. 83 ఏళ్ల వయసులో ఆక్సిజన్ సిలిండర్‌తో వికెట్ కీపింగ్! (వీడియో)

న్యూఢిల్లీ: సాధారణంగా 83 ఏళ్ల వయసులో ఏ వక్తి అయినా.. అయ్యో రామా! అనుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. కాస్త ఆరోగ్యంగా ఉంటే పుస్తకాలు చదవడమో లేక తమ అనుభవాలను యువ తరంతో పంచుకోవడమో చేస్తుంటారు. కానీ ఓ తాత 83 ఏళ్ల వయసులో వికెట్ కీపింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అది కూడా ఆరోగ్యం బాలేకపోయినా... ఆక్సిజన్ సిలిండర్ సాయంతో క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ తాత వికెట్ కీపింగ్ సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆ తాత ఓ మాజీ క్రికెటర్ కావడం మరో విశేషం. సాధారణంగా క్రికెటర్లు గరిష్టంగా 40-45 ఏళ్ల వరకు కెరీర్ కొనసాగిస్తారు. ఆ తర్వాత కామెంటేటర్‌గానో.. కోచ్‌గానో, విశ్లేషకుడిగానో జీవితం కొనసాగిస్తారు.

Alex Steele

కానీ స్కాట్లాండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ స్టీల్ 83 ఏళ్ల వయసులోనూ క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆటపై ఉన్న ఇష్టంతో అనారోగ్యాన్ని లెక్క చేయకుండా మైదానంలో బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.

అలెక్స్‌ స్టీల్ 2020 నుంచి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కువతో సిలిండర్ పెట్టుకొని తన ఆటను కొనసాగిస్తున్నాడు. అలెక్స్‌ స్టీల్ 1960ల్లో స్కాట్లాండ్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాడు. అతను 14 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 621 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా 11 క్యాచ్‌లు అందుకుని 2 స్టంపింగ్‌లు కూడా చేశాడు.

అలెక్స్ స్టీల్.. ఆక్సిజన్ సిలిండర్‌తో ఆడటం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తాతనా మజాకా.. నచ్చిన పని ముందు ఎంత కష్టమైనా సులువేనని చాటి చెబుతున్నాడని ప్రశంసిస్తున్నారు.

Story first published: Monday, August 7, 2023, 22:09 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+