Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Alex Hales: డ్రగ్స్ తీసుకున్నాడని పక్కన పెట్టినోడే ప్రపంచకప్ ఫైనల్ చేర్చాడు!

 Alex Hales redemption story: unexpected England return with predictable success at T20 World Cup

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో ఐర్లాండ్‌ చేతిలో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్.. అనూహ్యంగా ఫైనల్ చేరింది. సెమీస్ పటిష్టమైన భారత్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి దర్జాగా టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. అయితే ఇంగ్లండ్‌ సాధించిన అసాధార విజయంలో ఆ జట్టు ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ది కీలక పాత్ర. భారత బ్యాటర్లు తడబడిన వికెట్‌పై అతను ఆడిన విధానం ఆసాధారణం. తొలి బంతి నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతను ఊహించని ఆటతీరుతో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వాస్తవానికి అలెక్స్ హేల్స్ మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వస్తాడని ఎవరూ ఊహించలేదు. దాదాపు మూడేళ్లు ఆటకు దూరమైన హేల్స్ కథ ఎంతో ఆసక్తికరం.

 డ్రగ్స్ తీసుకోవడంతో..

డ్రగ్స్ తీసుకోవడంతో..

'నేను మళ్లీ ప్రపంచకప్‌ ఆడతానని అనుకోలేదు'... సెమీస్‌ ముగిసిన తర్వాత అలెక్స్‌ హేల్స్‌ వ్యాఖ్య ఇది. హేల్సే కాదు యావత్ క్రికెట్ ప్రేమికులు ఇదే అనుకున్నారు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు... హేల్స్‌ సరదాగా ప్రమాదకరం కాని 'రిక్రియేషనల్‌ డ్రగ్స్‌' తీసుకున్నాడు. దాంతో అతనిపై 3 వారాల నిషేధం విధించారు. అయితే అప్పటి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ దృష్టిలో మాత్రం డ్రగ్స్‌ వ్యవహారం చిన్న తప్పుగా అనిపించలేదు. దీనిని 'నైతికత'కు సంబంధించిన అంశంగా వాదించిన మోర్గాన్‌ వరల్డ్‌ కప్‌ జట్టులోంచి హేల్స్‌ను తీసేయించాడు.

 జట్టులోకి రానివ్వని మోర్గాన్..

జట్టులోకి రానివ్వని మోర్గాన్..

నిజానికి 2015 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ ఘోర వైఫల్యం తర్వాత జట్టు పునరుజ్జీవంలో హేల్స్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో ఇంగ్లండ్‌ రికార్డు స్కోర్లలో అతనిదే ప్రధాన పాత్ర. అయినా సరే మోర్గాన్‌ మాత్రం తగ్గలేదు. హేల్స్‌ను జట్టుకు దూరంగా ఉంచి తన మాట నెగ్గించుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే 'నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకు నువ్వు మళ్లీ ఇంగ్లండ్‌ జట్టులోకి రాలేవు' అని సందేశం ఇచ్చాడు. చివరకు అదే జరిగింది.

మూడేళ్ల నిరీక్షణ..

మూడేళ్ల నిరీక్షణ..

ఇంగ్లండ్‌ దేశవాళీ టోర్నీల్లో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. మరోవైపు జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్ రాణించడంతో హేల్స్ అవసరమే లేకుండా పోయింది. అయినా ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్‌లో మోర్గాన్‌ రిటైర్‌ అయ్యాడు. రొటేషన్ పాలసీలో భాగంగా సెప్టెంబర్‌లో హేల్స్‌కు టీమ్‌లో స్థానం లభించింది. పాకిస్థాన్‌ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్‌ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో తానేంటో నిరూపించాడు.

అసాధారణ బ్యాటింగ్‌తో..

అసాధారణ బ్యాటింగ్‌తో..

పాక్‌ టూర్‌ తర్వాత కూడా ఇంగ్లండ్‌ వరల్డ్‌ కప్‌ జట్టులో హేల్స్‌కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్‌స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్‌ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనూ ఇదే జరిగితే మరోసారి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Friday, November 11, 2022, 19:08 [IST]
Other articles published on Nov 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+