న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ వల్లే.. చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ సక్సెస్: మాజీ క్రికెటర్

Albie Morkel Says MS Dhoni and stability two big reasons for CSKs success
IPL 2020 : Two Main Reasons For CSK’s Success, Says Albie Morkel

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, జట్టులోని స్థిరత్వం వల్లే.. ఐపీఎల్‌‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిందని సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. ఈ రెండు కారణాల వల్లే చెన్నై మూడు స్లారు టైటిల్ విజేతగా నిలిచిందని ఈ మాజీ చెన్నై ప్లేయర్ ప్రశంసించాడు.

స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. 'చెన్నై జట్టులో ధోనీది చాలా పెద్ద పాత్ర. టీమిండియాకు మహీ ఎంత పెద్ద దిక్కో మన అందరికీ తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను చాలా పెద్ద ప్లేయర్. కెప్టెన్‌గా ఉంటే కచ్చితంగా సక్సెస్‌ను తీసుకొస్తాడు. ఇక ప్లేయర్లలోని సత్తాను రాబట్టడంలో మహీకి మించినోళ్లు లేరు. జట్టులో సురేశ్ రైనా, డ్వాన్ బ్రావోకు వెలకట్టలేం. వారిద్దరి అనుభవం టీమ్‌కు అదనపు బలంగా మారింది. సుదీర్ఘకాలంగా ఈ ఇద్దరు మహీతో కలిసి పనిచేయడం కూడా జట్టు విజయానికి కారణం. కోర్ గ్రూప్ ప్లేయర్లను లాంగ్ టైమ్ కొనసాగించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకే కెప్టెన్ కింద పని చేయడం కూడా వాళ్లకు కలిసొచ్చింది. అందుకే సీఎస్‌కే సక్సెస్‌కు నిలకడ రెండో కారణం. గత పది సీజన్లలో చెన్నై ఎనిమిదిసార్లు ఫైనల్‌‌కు చేరిందంటే ఆ టీమ్ స్థిరత్వం ఎలా ఉందో చెప్పొచ్చు'అని అల్బీ చెప్పుకొచ్చాడు.

2019 జనవరిలో అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ సఫారీ లెజెండ్.. చెన్నై తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్. మోర్కెల్ చెన్నై తరపున 91 వికెట్లు తీశాడు. ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా మహమ్మారి దెబ్బకు ఎప్రిల్ 15కు వాయిదా పడిని విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితి.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాటలు.. ఒలింపిక్స్ వచ్చే ఏడాది వాయిదాపడటం చూస్తుంటే ఈ ఏడాది ఐపీఎల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Story first published: Wednesday, March 25, 2020, 17:55 [IST]
Other articles published on Mar 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X