Alastair Cook: టీమిండియా బలహీనత అదే.. ఆ నిర్ణయమే డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీసేన కొంపముంచింది!

లండన్: భారత క్రికెట్ జట్టులో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నా.. స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం వారి బలహీనతని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. ఈ బలహీనతపై దెబ్బ కొడితే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీసేనపై ఇంగ్లండ్ పై చేయి సాధించవచ్చన్నాడు. ఈ సుదీర్ఘ సిరీస్‌లో బంతి స్వింగ్ అయితే ఇంగ్లండ్‌కు విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయని కుక్ చెప్పుకొచ్చాడు.
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత ఓటమికి టీమ్‌మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయమే కారణమన్నాడు. పరిస్థితులను అంచనా వేయకుండా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం కోహ్లీసేన కొంప ముంచిందని బీబీసీ పోడ్‌కాస్ట్‌లో కుక్ చెప్పుకొచ్చాడు.

కదిలే బంతులతో కష్టం..
'భారత్ గొప్ప జట్టు. కానీ స్వింగయ్యే పరిస్థితులు ఉంటే మాత్రం ఇంగ్లండ్‌కు మెరుగైన విజయవకాశాలు ఉంటాయి. ఆగస్టులో వాతావరణం చల్లగా ఉండి, మైదానంలో మాయిశ్చర్ ఉంటే మాత్రం ఇంగ్లండ్ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగుతారు. ఇక భారత జట్టులో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ ఉన్నారు. కానీ కదిలే బంతిని ఆడలేకపోవడం వారి బలహీనత. వారి వీక్‌టెస్‌పై దెబ్బకొడితే మాత్రం ఇంగ్లండ్ అవకాశాలు సృష్టించుకోవచ్చు.'అని కుక్ చెప్పుకొచ్చాడు.

అత్యుత్సాహంతో..
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా తుది జట్టు ఎంపికలో తప్పులు చేసిందని కుక్ అభిప్రాయపడ్డాడు. కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్లు కనిపించిందన్నాడు. 'జట్టు ఎంపికపై కోహ్లీసేన అతి ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. మూడు రోజులు ముందుగానే జట్టును ప్రకటించింది. ఆటలో ఎక్కువ భాగం వర్షం కురుస్తుందని ముందే తెలిసినా ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నారు. దాంతో ఎక్కువగా సీమ్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇద్దరు స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు అయినప్పటికీ వారికి పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు' అని కుక్ తెలిపాడు.

మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం..
మెగా ఫైనల్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా కోహ్లీసేన ఓటికి కారణమని కుక్ అభిప్రాయపడ్డాడు.'న్యూజిలాండ్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టే గెలిచిందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇంగ్లండ్‌తో ఆడిన రెండు టెస్టులతో వారికి సన్నద్ధత లభించింది. అంతర్గత మ్యాచులు ఆడాలన్న ఉద్దేశం మంచిదే అయినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. తొలి గంటలో ఉన్నంత తీవ్రత, ఊపు తర్వాత ఉండవు' అని కుక్ చెప్పుకొచ్చాడు.

8 వికెట్లతో చిత్తు..
న్యూజిలాండ్‌తో జరిగిన మెగా ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను రిజర్వ్ డేకు పొడిగించినా రెండున్నర రోజుల ఆటనే సాధ్యమైంది. అయినా ఫలితం తేలిందంటే పరిస్థితులు బౌలింగ్‌కు ఎంతలా సహకరించాయో అర్థం చేసుకోవచ్చు. చివరి రోజు ఆటలో డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. కివీస్ పేసర్ల ధాటికి భారత బ్యాట్స్‌మన్ నిలబడలేకపోయారు. మరోవైపు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చి విజయాన్నందుకున్నారు. ముఖ్యంగా కైల్ జెమీసన్ ఆల్‌రౌండ్ షోతో భారత్ పతనాన్ని శాసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications