For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యశస్వి జైస్వాల్.. ఏం గుండెరా నీది: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలిస్టర్ కుక్ ప్రశంసల జల్లు కురిపించాడు. 22 ఏళ్ల వయసులోనే యశస్వి జైస్వాల్.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ అయిన మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జింగ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ సంకల్పం తనను ఆకట్టుకుందని చెప్పాడు.

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, మిచెల్ స్టార్క్ మాధ్య చిన్నపాటి మాటల యుద్దం నడిచింది. బ్యాటింగ్ చేస్తూ మిచెల్ స్టార్క్.. టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాను స్లెడ్జింగ్ చేశాడు. చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావని రెచ్చగొట్టాడు. అతనిస్లెడ్జింగ్‌కు హర్షిత్ రాణా స్పందించకున్నా.. బ్యాటింగ్ సమయంలో యశస్వి జైస్వాల్ ధీటుగా బదులిచ్చాడు.

Alastair Cook hails Yashasvi Jaiswal for sledging Mitchell Starc in Perth Test

చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావని మిచెల్ స్టార్క్‌ను రెచ్చగొట్టాడు. యశస్వి జైస్వాల్ ఆసీస్ గడ్డపై మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మాటలతోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ యశస్వి జైస్వాల్ దూకుడు కనబర్చాడు. 161 పరుగులతో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో యశస్వి జైస్వాల్‌ను ఆసీస్ మీడియా కొనియాడింది.

టీమిండియా న్యూ కింగ్ అంటూ ప్రశంసించింది. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ గురించి ఓ ఛానెల్‌తో మాట్లాడిన అలిస్టర్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఆసీస్ గడ్డపై మిచెల్ స్టార్క్‌ను యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ చేయడమే కాకుండా అతని బౌలింగ్ వేగంగా లేదని చెప్పాడు. మిచెల్ స్టార్క్ ఎప్పుడూ వేగంగా బౌలింగ్ చేస్తాడు. ఒకవేళ అతను స్లోగా బౌలింగ్ చేసినా.. ఆ విషయం ఎవరూ అతనితో చెప్పరు. ఎందుకంటే అతను మరింత దూకుడుగా బౌలింగ్ చేస్తాడు. కానీ 22 ఏళ్ల వయసులో యశస్వి జైస్వాల్ స్టార్క్‌‌కు ఈ విషయాన్ని తెలియజేశాడు.

అంటే అతనికి ఎన్ని గట్స్ ఉండాలి. జైస్వాల్ ఓ క్లాసిక్ ప్లేయర్. ఇంగ్లండ్‌పై యశస్వి జైస్వాల్ సెంచరీలను ఆ జట్టు ఆటగాడిగా ఆస్వాదించలేకపోయాను. కానీ ఆస్ట్రేలియాపై జై స్వాల్ ఆటను ఆస్వాదిస్తున్నాను. తొలి 15 టెస్ట్‌ల్లో ఏ భారత ఆటగాడు చేయని ఫీట్‌లను జైస్వాల్ సాధించాడు.'అని అలిస్టర్ కుక్ కొనియాడాడు.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభమయ్యే పింక్ బాల్‌ టెస్ట్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే సన్నాహక మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ శతకాలతో రాణించడంతో పాటు బుమ్రా సంచలన బౌలింగ్‌తో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Story first published: Wednesday, December 4, 2024, 16:04 [IST]
Other articles published on Dec 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+