Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

50 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెటర్‌గా గుర్తించిన ఇంగ్లండ్

Alan Jones finally handed England Test cap

లండన్: ఇంగ్లండ్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ అలాన్‌ జోన్స్‌ కోరికను ఆ దేశ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 50 ఏళ్ల తర్వాత తీర్చింది. 1970లో జోన్స్‌ తన కెరీర్‌లో ఏకైక టెస్టును ఇంగ్లండ్‌ తరఫున రెస్టాఫ్‌ ది వరల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అయితే కొన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) ఆ మ్యాచ్‌కు టెస్టు హోదాను తీసేసింది. దాంతో ఇంగ్లండ్‌ టెస్టు క్రికెటర్‌ను అనిపించుకోలేకపోయాననే బాధ అతడిని వెంటాడింది.

ఆ మ్యాచ్‌ జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా జోన్స్‌ను టెస్టు ఆటగాడిగా గుర్తిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వరుస ప్రకారం అతనికి '696' నంబర్‌ క్యాప్‌ను గత బుధవారం ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్, మాజీ సారథి టోని లూయిస్, ఈసీబీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ సమక్షంలో అందించింది. దీంతో జోన్స్‌ సంబరపడిపోయాడు.

ఆన్ ఫీల్డ్, ఆఫ్ ది ఫీల్డ్‌లో అలాన్ అందుకున్న ఘనతలను సెలెబ్రేట్ చేయాలని భావించి, అతను మ్యాచ్ ఆడి 50 ఏళ్ల అయిన సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రేవ్స్ తెలిపాడు. ఇక రికార్డు బుక్‌లో అలాన్‌కు క్యాప్ ఇచ్చినట్లు ఎక్కడా లేదని అందుకే 696 నెంబర్ ఆటగాడిగా క్యాప్ అందించామన్నాడు. ఇక 50 ఏళ్ల తర్వాత తనను టెస్ట్ క్రికెటర్‌గా గుర్తించడం పట్ల అలాన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చక్కటి రికార్డు ఉన్న జోన్స్‌ 645 మ్యాచ్‌లలో 56 సెంచరీలుసహా 36,049 పరుగులు చేశాడు.

Story first published: Thursday, June 18, 2020, 15:26 [IST]
Other articles published on Jun 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+