Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: చిత్తుగా ఓడిన జమైకా.. ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌!

Akeal Hosein and Lendl Simmons help Trinbago Knight Riders cruise into CPL 2020 final

ట్రినిడాడ్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) 2020 సీజన్‌లో లీగ్‌ దశను అజేయంగా దాటిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ సెమీఫైనల్లోనూ అదే దూకుడును కనబరిచి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. జమైకా తలవాస్‌‌తో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నైట్‌రైడర్స్‌ 9 వికెట్లతో గెలుపొందింది. దీంతో సీపీఎల్‌‌లో మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బాలీవుడ్‌ నటులు షారూఖ్‌ ఖాన్, జూహీ చావ్లాలకు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు గతంలో 2017, 2018 సీజన్‌లో ఫైనల్‌ చేరి చాంపియన్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. అకీల్‌ హుసీన్‌ (3/14), క్యారీ పియరీ (2/29) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. బోనర్‌ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు), రోవ్‌మాన్‌ పొవెల్‌ (35 బంతుల్లో 33; 1 ఫోరు, 1 సిక్స్‌) తలవాస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్(2) అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. సునీల్ నరైన్, ఫవాద్ అహ్మద్ చెరొక వికెట్ తీశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారత ఆటగాడు ప్రవీణ్ తాంబేకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌ 15 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 111 చేసి గెలుపొందింది. ఓపెనర్‌ లెండిల్‌ సిమ్మన్స్‌ అజేయ అర్ధ సెంచరీ (44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 నాటౌట్‌)తో రాణించాడు. అతడికి టియాన్‌ వెబ్‌స్టర్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 44 నాటౌట్‌) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు ఒక వికెట్ దక్కింది. విజయంలో కీలక పాత్ర పోషించిన అకీల్ హుసీన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక గయానా అమెజాన్‌ వారియర్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సెయింట్‌ లూసియా జూక్స్‌ 10 వికెట్లతో గెలుపొందింది. గురువారం జరిగే ఫైనల్లో నైట్‌రైడర్స్‌.. సెయింట్ లూసియా జౌక్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Wednesday, September 9, 2020, 8:30 [IST]
Other articles published on Sep 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+