Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు అంత సీన్ లేదు: ఆకాశ్ మధ్వాల్

న్యూఢిల్లీ: స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు తాను ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని ముంబై ఇండియన్స్ నయా సెన్సేషన్ ఆకాశ్ మధ్వాల్ అన్నాడు. బుమ్రాను భర్తీ చేసే స్థాయికి ఇంకా తాను చేరలేదని తెలిపాడు. జట్టులో తన వంతు బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆకాశ్ మధ్వాల్ సంచలన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆకాశ్ మధ్వాల్ కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 'ముంబై నాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నేనేమి జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయం కాదు. కానీ నా వంతుగా జట్టు విజయం కోసం ఏం చేయగలనో అది చేస్తున్నా.

 Akash Madhwal

లక్నోతో ఎలిమినేటర్‌లో చెపాక్‌ పిచ్‌ నుంచి పేసర్లకు పూర్తి సహకారం లేకపోయినా.. బ్యాటర్లకు ఇబ్బందిగా ఉన్న లెంగ్త్‌లో బంతిని వేసి వికెట్ల కోసం ప్రయత్నించి ఫలితం సాధించా. కెప్టెన్‌ రోహిత్‌ భాయ్‌కి నా బౌలింగ్ బలమేంటో తెలుసు. నెట్స్‌లో ఎక్కువగా యార్కర్లు వేసినా.. కొత్త బంతితో బౌలింగ్‌ చేయగలనని నమ్మాడు.

అందుకే ఏ స్థితిలో నన్ను బరిలో దింపాలో అతనికి అవగాహన ఉంది. నా సక్సెస్ పూర్తి క్రెడిట్ రోహిత్ భాయ్‌దే. ముందుగా ఆర్‌సీబీలో చేరిన నాకు సరైన అవకాశాలు దక్కలేదు. ముంబై ఇండియన్స్‌లో నా ప్రతిభను గుర్తించిన సపోర్ట్ స్టాఫ్ నన్ను మరింత మెరుగుపరిచి అవకాశం ఇచ్చారు ' అని ఆకాశ్‌ మధ్వాల్ చెప్పుకొచ్చాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన 29 ఏళ్ల మధ్వాల్‌.. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశాడు. స్టార్‌ ప్లేయర్ రిషభ్ పంత్‌ ఇంటికి ఎదురింట్లోనే ఉండే మధ్వాల్‌.. అతనికి శిక్షణ ఇచ్చిన అవతార్‌సింగ్‌ దగ్గరే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎక్కువగా టెన్నిస్‌ బంతితోనే ఆడిన ఆకాశ్.. బ్యాటర్లు సిక్సర్లు కొట్టకుండా యార్కర్లు వేయడాన్ని అలవాటు చేసుకున్నాడు.

ఉత్తరాఖండ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆకాశ్.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2019లో ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు నెట్‌ బౌలర్‌గా సేవలందించిన మధ్వాల్‌ ఆ తర్వాత ముంబై జట్టులో కూడా కొన్నాళ్లు అదే పాత్రలో కొనసాగాడు.

ఈ సీజన్లో స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయంతో వైదొలగడం ఆకాశ్ మధ్వాల్‌కు కలిసొచ్చింది. తుది జట్టులో చోటు దక్కించుకోవడమే కాకుండా ఇప్పటిదాకా 7 మ్యాచ్‌లు ఆడి 12.85 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, May 26, 2023, 8:41 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+