Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే కోహ్లీ, రోహిత్‌లను పెళ్లికి పిలవలేదు: ఆకాష్ దీప్

టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. బీహార్‌కు చెందిన ఈ స్టార్ బౌలర్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేశాడు. ఈ వేడుకకు పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం వేదిక అయింది. వారణాసిలోని ఓ హోటల్‌లో అక్షితా రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. రెండ్రోజుల కిందటే బిహార్‌లోని స్వగ్రామంలో పెళ్లి వేడుకలు ప్రారంభం కాగా బుధవారం బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది. పలువురు క్రికెటర్లు వేడుకకు హాజరై డ్యాన్స్‌లు వేసి సందడి చేశారు.

ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా.. తమ సంప్రదాయం మేరకు ఆకాష్ దీప్ ఖడ్గంతో కన్పించాడు. ఆకాష్ దీప్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఒక వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది.

IPL 2027: హార్దిక్ పాండ్యాపై కన్నేసిన ఆ రెండు ఫ్రాంచైజీలు!

IPL 2027: హార్దిక్ పాండ్యాపై కన్నేసిన ఆ రెండు ఫ్రాంచైజీలు!

వారిని తట్టుకుంటామా..?

ఆ వీడియోలో ఒక అతిథి సరదాగా.. 'భయ్యా.. నీ పెళ్లికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలను ఎందుకు ఆహ్వానించలేదు?' అని ప్రశ్నించాడు. దానికి ఆకాష్ దీప్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి నవ్వులు పూయించాడు. 'ఒకవేళ వారంతా ఇక్కడికి వస్తే.. ఇక ఈ బనారస్‌లో నా పెళ్లి సజావుగా సాగుతుందా చెప్పండి?' అని ప్రశ్నించాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. భారత స్టార్ ఆటగాళ్లు వస్తే అభిమానుల తాకిడి ఏ రేంజ్‌లో ఉంటుందో, ఆ అభిమానులను తట్టుకుని పెళ్లి జరిపించడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి అని ఆకాష్ దీప్ చెప్పిన సమాధానం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.

Akash Deep Reveals the Exact Reason Why He Didn t Invite MS Dhoni Virat Kohli Rohit Sharma to His Wedding

ఎవరీ అక్షిత రాజ్?

ఆకాష్ దీప్ బీహార్‌లోని రోహతాస్ జిల్లా బడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా.. ఆయన సతీమణి అక్షిత రాజ్ కూడా అదే జిల్లాలోని మణికపూర్ నివాసి. ఆమె తండ్రి పేరు అమిత్ కుమార్ సింగ్. అక్షిత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరిద్దరిదీ పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి. చదువులో ఎంతో ప్రతిభావంతురాలైన అక్షిత రాజ్.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీసీఏ, ఎంసీఏ పట్టాలను అందుకుంది.

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నేను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్: జోఫ్రా ఆర్చర్

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నేను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్: జోఫ్రా ఆర్చర్

ఉన్నత చదువులు చదివిన అక్షిత రాజ్‌కు ఒక ప్రముఖ ఐటీ కంపెనీ నుంచి భారీ ప్యాకేజీతో కూడిన ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆకాష్ దీప్‌తో పెళ్లి కోసం ఆమె ఆ భారీ ఆఫర్‌ను కూడా తిరస్కరించినట్లు సమాచారం. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆకాష్ దీప్ కెరీర్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


గాయంతో ఆటకు దూరం..

ఆకాష్ క్రికెట్ విషయానికి వస్తే.. గతేడాది ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఆకాష్ దీప్‌ను కొనుగోలు చేసుకున్నప్పటికీ.. వెన్నునొప్పి కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. క్రికెట్ నుంచి దొరికిన ఈ విరామంలో‌నే ఆకాష్ దీప్ పెళ్లి చేసుకొని కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే ఈ పెళ్లిని అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్నాడు. క్రికెటర్ల ఎవర్నీ పిలవలేదు. సోషల్ మీడియా వేదికగా ఆకాష్ దీప్‌కు సహచర ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Story first published: Thursday, June 25, 2026, 13:39 [IST]
Other articles published on Jun 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+