Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే బెన్‌ డకెట్‌పై చేతులు వేసి సెండాఫ్ ఇచ్చా: ఆకాష్ దీప్

ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను ఔట్ చేసిన అనంతరం అతని భుజాలపై చేతులు వేసి ఏదో మాట్లాడుతూ సెండాఫ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఆకాష్ దీప్‌ను అందరూ తప్పుబట్టారు. భారత మాజీ ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు కూడా విమర్శలు గుప్పించారు.

ఔటై వెళ్తున్న బ్యాటర్‌‌తో అలా వ్యవహరించడం సరికాదని, బెన్ డకెట్ మాత్రం సహనం కోల్పోకుండా ఉండటం గొప్ప విషయమని కొనియాడారు. రికీ పాంటింగ్ అయితే బెన్ స్టోక్స్ స్థానంలో ఉండి ఉంటే ఆకాష్ దీప్ చెంపలు వాయించేవాడినని తెలిపాడు. ఇంతలా చర్చనీయాంశమైన ఈ ఘటనపై తాజాగా ఆకాష్ దీప్ స్పందించాడు.

Akash Deep Reveals Reason For Unique Send-off to Ben Duckett You Miss I Hit
Photo Credit: X (twitter)

బెన్ డకెట్ రెచ్చగొట్టడంతోనే..

తనను ఔట్ చేయలేనని బెన్ డకెట్‌ రెచ్చగొట్టడంతోనే అలా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పాడు. ' బెన్ డకెట్‌పై నాకు మంచి రికార్డ్ ఉంది. అతన్ని నేను చాలా సార్లు ఔట్ చేశాను. లెఫ్టార్మ్ బ్యాటర్లపై నాకు మంచి రికార్డ్ ఉంది. డకెట్ కూడా అంతే. ఆ రోజు అతను వినూత్నమైన షాట్స్‌తో నా లైన్, లెంగ్త్‌ దెబ్బతినేలా ప్రయత్నం చేశాడు. అసాధారణ షాట్స్ ఆడాడు. ఆ సమయంలో నాతో మాట్లాడుతూ..'ఈ రోజు నాది.. నువ్వు నన్ను ఔట్ చేయలేవు'అని రెచ్చగొట్టాడు.

ఆ మాటే చెప్పాను..

వాస్తవానికి ఒక బ్యాటర్ క్రీజు మీద కదులుతూ.. ఇలాంటి వినూత్న షాట్స్ ఆడుతుంటే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం కష్టమవుతోంది. అప్పటికే ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేస్తోంది. ఆ సమయంలో మాకు ఒక వికెట్ తీయడం కీలకమైంది. పైగా మేం సాధారణ స్కోర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సమయంలోనే నేను బెన్ డకెట్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత నవ్వుతూ.. 'నీవు మిస్ చేస్తే.. నేను హిట్ చేస్తాను.. ఎప్పుడూ నీవే గెలవవు. ఈ సారి నేను గెలిచాను'అని అతనితో అన్నాను. ఇది అతను నాతో అన్న మాటలకు కొనసాగింపుగా మాత్రమే చేశాను. ఇదంతా మంచి స్ఫూర్తితో జరిగింది. ఎలాంటి సమస్య లేదు.'అని ఆకాష్ దీప్ చెప్పుకొచ్చాడు. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌‌ను భారత్ 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 10, 2025, 16:24 [IST]
Other articles published on Aug 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+