For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిక్సర్లకు దుబాయ్ అడ్డాలాంటిది.. కానీ పర్యవేక్షణకు మాకొచ్చిన కష్టం ఏం లేదు!

Ajit Singh Says Managing IPL’s ACU operations at 3 venues in UAE will be slightly easier
IPL 2020 Set To Start On September 19, Final On November 8 || Oneindia Telugu

ముంబై: మ్యాచ్ ఫిక్సర్లకు దుబాయ్ అడ్డాలాంటిదైనా.. ఐపీఎల్‌-2020 జరిగే సమయంలో ఫిక్సింగ్, బెట్టింగ్‌ తదితర అంశాలపై ఒక కన్నేసి ఉంచడంలో ఎలాంటి కష్టం ఉండబోదని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధినేత అజిత్‌ సింగ్‌ అన్నారు. దేశంలోని ఎనిమిది వేదికలతో పోలిస్తే మూడు చోట్లనే మ్యాచ్‌లు జరగనుండటం తమ పని సులువు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లీగ్‌ను బయో సెక్యూర్‌ వాతావరణంలో నిర్వహిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ ఏర్పాట్లు చేసుకుంటామని అజిత్‌ సింగ్‌ వెల్లడించారు.

'క్రికెట్‌లో అవినీతిని అరికట్టే విషయంలో మా టీమ్ సమర్థంగా పని చేస్తుంది. అది మన దేశంలో అయినా మరెక్కడైనా పనితీరు ఒకే తరహాలో ఉంటుంది. బుకీల వ్యవహారంపై మాకు స్పష్టత ఉంది. నిజానికి ఫిక్సర్లకు యూఏఈ అడ్డాలాంటిది. అయితే అక్కడి మూడు వేదికల్లో ఫిక్సింగ్‌పై దృష్టి పెట్టేందుకు మేం తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం. ఒక వేళ తగినంత మంది అధికారులు లేరని భావిస్తే అక్కడే ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి వారి అనుమతితో అక్కడి మనుషులనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటాం. అంతే కానీ ఎలాంటి ఉదాసీతనకు చోటివ్వం'అని అజిత్ సింగ్ స్పష్టం చేశారు.

ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలను సమాయత్తం కావాలని ఆదేశించామన్నారు. మొత్తం 51 రోజుల పాటు ఫుల్ షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత అధికారికంగా షెడ్యూల్ విడుదలకానుంది.

Story first published: Monday, July 27, 2020, 10:41 [IST]
Other articles published on Jul 27, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+