Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అజిత్ అగార్కర్‌పై వేటు.. భారత చీఫ్ సెలెక్టర్‌గా తెలుగోడు?

భారత క్రికెట్ పురుషుల సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్‌గా మళ్లీ తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీమిండియా దిగ్గజ క్రికెటర్, తెలుగు తేజం, సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతని కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని ఓ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఓ కథనాన్ని రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Ajit Agarkar Under Pressure as VVS Laxman Emerges as Front-Runner for Chief Selector Role Reports

లక్ష్మణే సరైనోడు..

'భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి ప్రమాదంలో పడింది. అతన్ని కొనసాగించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. భారత నయా చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో వీవీఎస్ లక్ష్మణ్ ముందంజలో ఉన్నారు. వీవీఎస్ లక్ష్మణ్ ఎంట్రీతో అజిత్ అగార్కర్‌కు ఉద్వాసన తప్పేలా లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చల దశలోనే ఉంది.

సెప్టెంబర్‌లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్‌గా ఉంటే అతని మాటలకు విలువ ఉంటుందని, రోహిత్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు కూడా అతని సలహాలు పాటిస్తారని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ ఆ విషయంలో మెరుగుపడాలి: వీవీఎస్ లక్ష్మణ్

వైభవ్ సూర్యవంశీ ఆ విషయంలో మెరుగుపడాలి: వీవీఎస్ లక్ష్మణ్

శ్రీలంక పర్యటన అగార్కర్‌కు అగ్ని పరీక్ష..

ఇటీవల టీమ్ సెలెక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అగార్కర్‌ను కొనసాగించాలా? లేక లక్ష్మణ్‌ను తీసుకురావాలా?అనేది బీసీసీఐ బేరిజు వేస్తోంది. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఫలితంపైనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. ఒకవేళ భారత్ ఈ సిరీస్‌ను గెలిస్తే.. అగార్కర్ పదవీకాలం పొడిగించవచ్చు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై కూడా బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. సెక్రటరీ దేవజిత్ సైకియా వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత జట్టును నడిపిస్తున్న వారికి రోహిత్ శర్మ జట్టులో కొనసాగడం ఇష్టం లేదు.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన ఓటములపై ఇప్పటివరకు సమీక్షా సమావేశం జరగలేదు. ఇంగ్లండ్ పర్యటన తర్వాతే ఈ రివ్యూ మీటింగ్ జరగాల్సింది. కానీ దేజిత్ సైకియా అనారోగ్యం కారణంగా ఈ సమీక్ష సమావేశం జరగలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో ఈ సమావేశం జరగనుంది. గంభీర్.. ఆన్‌లైన్‌ వేదికగా ఈ మీటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.'అని అభిషేక్ త్రిపాఠి అనే స్పోర్ట్స్ జర్నలిస్ట్ తన కథనంలో రాసుకొచ్చాడు.

టీమిండియాలో కొత్త అవార్డ్.. విన్నర్ అతనే! వైభవ్, మయాంక్ కాదు!

Also Read

టీమిండియాలో కొత్త అవార్డ్.. విన్నర్ అతనే! వైభవ్, మయాంక్ కాదు!

సెప్టెంబర్‌లో ముగియనున్న పదవికాలం..

2023 జూలైలో భారత చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ పదవి కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనుంది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ టీ దిలీప్, ర్యాన్ టెన్ డస్కాటే తరహాలో అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ వేటు వేస్తుందా? లేక కొనసాగిస్తుందా? అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ చివరిసారిగా భారత చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించారు.

Story first published: Wednesday, August 5, 2026, 8:42 [IST]
Other articles published on Aug 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+