Ajit Agarkar: శ్రీలంకతో 6 మ్యాచ్‌లకు 6 గెలిచినా శిఖర్ ధావన్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కదు!

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్.. శ్రీలంక పర్యటనలో రాణించినా కెప్టెన్‌గా వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసినా అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమేనని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ గబ్బర్‌పై పైచేయి సాధించారని అభిప్రాయపడ్డాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఓపెనింగ్‌కు సిద్ధమేనంటున్న నేపథ్యంలో గబ్బర్ అవకాశాలు మూసుకుపోయాయన్నాడు. తాజాగా హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంక పర్యటలో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా గబ్బర్ అదరగొట్టాలని ఆకాంక్షించాడు.

ఒత్తిడి పెంచడమే..
'పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి. శిఖర్ ధావన్ పరుగులు చేస్తున్నా.. కేఎల్ రాహుల్, రోహిత్ అతన్ని అధిగమించారనే అనిపిస్తోంది. పరుగులు చేస్తూనే వారిద్దరిపై అతను ఒత్తిడి పెంచాలి. భారీ స్కోర్లు చేయాలి. ఒక ఆటగాడిగా ఇంతకన్నా చేసేదేం ఉండదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఎంపికకు లంకలో ప్రదర్శన ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. వారిద్దరిపై ఒత్తిడి పెంచడమే గబ్బర్ ముందున్న పని. ఇంగ్లండ్‌తో తొలి టీ20 ఆడిన తర్వాత ధావన్‌కు చోటు దక్కలేదు.

రాహుల్‌తో పోటీ..
వన్డేల్లో పునరాగమనం చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో పరుగులు చేశాడు. అతడు ఎలాంటి పొరపాట్లు చేయడం లేదు. దురదృష్టవశాత్తు ఇంగ్లండ్ సిరీస్ ఆడలేదు. సమీకరణాల్లో అతను ఒదిగిపోలేదు. కేఎల్ రాహుల్ అతడికన్నా ముందున్నాడని నా ఉద్దేశం. వైస్ కెప్టెన్ రోహిత్ ఎలాగూ జట్టులో ఉంటాడు. ఇంగ్లండ్ సిరీసులో అంతగా రాణించకపోయినా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్‌కు తిరుగులేదు. అందుకే శిఖర్ ధావన్‌కు కష్టమవుతోంది. అంతేకాకుండా కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని చెప్పాడు.' అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్సీతో ఒరిగేదేం లేదు..
ఇక శ్రీలంక పర్యటనలో భారత జట్టును నడిపిస్తున్న శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీతో ఒరిగేదేం లేదని అగార్క్ అభిప్రాయపడ్డాడు. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లను క్వీన్ స్వీప్ చేసినా ధావన్‌కు అవకాశం దక్కడం కష్టమేనన్నాడు. 'శిఖర్ ధావన్‌ను కెప్టెన్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. కానీ సెలెక్టర్లు జట్టులో అనుభవం కలిగిన ఆటగాడికి సారథ్య బాధ్యతలు ఇవ్వాలనుకున్నారని అర్థమవుతోంది.
తన కెరీర్ చివరి దశలో భారత జట్టుకు నాయకత్వం వహించడం అతనికి దక్కిన గౌరవం. అయితే కెప్టెన్సీతో అతనికి వ్యక్తిగతంగా ఒరిగేదేం లేదు. భారత్ 6-0తో గెలిచినా.. అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమే. భారీ స్కోర్లు నమోదు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.'అని అగార్కర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications