Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్సీ కంటే ఫిట్‌నెస్ కాపాడుకోవడమే రోహిత్ శర్మ ముందున్న అతిపెద్ద సవాల్: మాజీ క్రికెటర్

Ajit Agarkar feels Rohit Sharma’s Biggest Challenge As Captain Will Be To Remain Fit

న్యూఢిల్లీ: భారత జట్టు సారథ్య బాధ్యతల నిర్వర్తించడం కంటే ఫిట్‌నెస్ కాపాడుకోవడమే కెప్టెన్ రోహిత్ శర్మ ముందున్న అతిపెద్ద సవాలని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీకి వంక పెట్టాల్సిన పనిలేదని, కానీ అతని ఫిట్‌నెస్సే ఆందోళనకు గురిచేస్తోందని తెలిపాడు.
భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ.. ఫిట్‌నెస్ పరంగా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారని గుర్తు చేశాడు. ఆ స్థాయి ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్‌ చేయడమే ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందున్న అతి పెద్ద సవాలని అగార్కర్‌ అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ, ధోనీలా..

కోహ్లీ, ధోనీలా..

'ఇంతకు ముందు టీమిండియా కెప్టెన్లుగా పని చేసిన మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ చాలా ఫిట్‌గా ఉండేవాళ్లు. ఫిట్‌నెస్ విషయంలో మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచారు. చాలా అరుదుగా మ్యాచులకు దూరమయ్యేవారు. ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. వాళ్ల స్థాయి ఫిట్‌నెస్‌ని నిలుపుకోవడం కష్టమేననిపిస్తోంది. అలా అయితే, అన్ని మ్యాచులకు అతను అందుబాటులో ఉండలేడు. వన్డే ఫార్మాట్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాక అతను గాయంతో తొలి సిరీస్‌కే దూరమయ్యాడు. ఇలాంటివి జట్టు ప్రదర్శనపై చాలా ప్రభావం చూపిస్తాయి.

ఫిట్‌గా ఉండటం సవాలే..

ఫిట్‌గా ఉండటం సవాలే..

కెప్టెన్‌గా జట్టును నడిపించినంత కాలం అతను ఫిట్‌గా ఉండటం పెద్ద సవాలే. కానీ, అతను ఫిట్‌నెస్ కాపాడుకుంటూ అన్ని మ్యాచులకు అందుబాటులో ఉంటే.. టీమిండియాకు తిరుగుండదు. అన్నీ మ్యాచ్‌లు ఆడితేనే ఆటగాళ్లను దగ్గరి నుంచి గమనించే అవకాశం ఉంటుంది. తద్వారా రానున్న టీ20, వన్డే ప్రపంచ కప్‌లకు అత్యుత్తమ జట్టుని తీర్చిదిద్దుకునే అవకాశం రోహిత్‌కు దొరుకుతుంది.

రోహిత్‌కు సూపర్ రికార్డు..

రోహిత్‌కు సూపర్ రికార్డు..

పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌పై బాధ్యతలు మరింత పెరుగుతాయి. తాత్కలిక కెప్టెన్‌ అయితే.. కొన్ని సిరీస్‌లకో, కొన్ని మ్యాచ్‌లకో జట్టుని సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. కానీ, పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాక దూర దృష్టితో ఆలోచించాల్సి ఉంటుంది. టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా నాణ్యమైన జట్టుని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా రోహిత్‌కి ఇప్పటికే మంచి రికార్డుంది.

కోహ్లీ ఫామ్‌లోకి వస్తే..

కోహ్లీ ఫామ్‌లోకి వస్తే..

ఒక్క ఐపీఎల్‌లోనే కాదు.. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచులకు దూరమైన సమయంలో కూడా భారత జట్టుని మెరుగ్గా నడిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటర్‌గానూ అతనికి తగినంత అనుభవం ఉంది. ఈ విషయాలన్నీ రోహిత్‌కి కలిసొస్తాయనడంలో సందేహం లేదు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తే రోహిత్‌కు సగం భారం తగ్గుతుంది. అతని పని మరింత సులువు అవుతోంది. అప్‌కమింగ్ వెస్టిండీస్ సిరీస్‌తో కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నా' అని అగార్కర్‌ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో.. అహ్మదాబాద్‌ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌తో రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

Story first published: Tuesday, February 1, 2022, 18:56 [IST]
Other articles published on Feb 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+