Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC: అందుకే శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టాం: అజిత్ అగార్కర్

టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. జట్టులో 15 మంది ఆటగాళ్లనే ఎంపిక చేయగలమని, ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరు టీమ్‌కు దూరం కావాల్సి ఉంటుందన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బోర్డ్ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన టీమ్ సెలెక్షన్ సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సెలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం 15 మంది సభ్యులతో కూడిన భారత టీ20 ప్రపంచకప్ జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు.

Ajit Agarkar Explains Why Shubman Gill Was Dropped from India s T20 World Cup Squad

శుభ్‌మన్ గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మపై వేటు పడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. రింకూ సింగ్ రీఎంట్రీ ఇవ్వగా.. అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టును అలానే కొనసాగించారు. ఈ జట్టే న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.

గిల్‌ను తప్పించక తప్పలేదు..

శుభ్‌మన్ గిల్‌ను తప్పించడానికి గల కారణాన్ని అగార్కర్ వెల్లడించాడు. 'శుభ్‌మన్ గిల్ ఎంతటి క్వాలిటీ ప్లేయరో మనందరికి తెలుసు. ప్రస్తుతం అతను పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో కూడా విభిన్న కాంబినేషన్ల కారణంగా అతనికి భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఆటగాడి కంటే టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యం. ఈ సారి కూడా టీమ్ కాంబినేషన్‌లో భాగంగా శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలం. ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరు జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఆ దూరమయ్యే ఆటగాడు గిల్ అయ్యాడు.

శుభ్‌మన్ గిల్ లేనప్పుడు అక్షర్ పటేల్ టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ గిల్ అందుబాటులో లేడు కాబట్టి ఆ బాధ్యతలను తిరిగి అక్షర్‌కే అప్పగించాం. టాపార్డర్‌లో ఆడే వికెట్ కీపర్ కావాలని భావించాం. అందుకే జితేష్ శర్మను తప్పించి ఇషాన్ కిషన్‌ను తీసుకున్నాం. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా అతను ఓపెనర్‌గా కూడా రాణించగలడు.

మాకు మరో ఆప్షన్ లేదు..

యశస్వి జైస్వాల్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. గత టీ20 ప్రపంచకప్ జట్టులో అతను ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఈ సారి అతను దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో కుర్రాళ్లు రాణించడం చూసినప్పుడల్లా సంతోషంగా ఉంటుంది. కానీ మేం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలం. ఇక్కడ మరో 10 మంది పేర్లు తీసుకోని వారికి చోటు లేదని చెప్పవచ్చు. అయితే మేం 15 మందిని మాత్రమే ఎంపిక చేయగలం కాబట్టి మాకు మరో ఆప్షన్ లేదు.

Story first published: Saturday, December 20, 2025, 15:27 [IST]
Other articles published on Dec 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+