Ajit Agarkar: సౌతాఫ్రికా ఉచ్చులో విరాట్ కోహ్లీ చిక్కుకున్నాడు

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా బిగించిన ఉచ్చులో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుకొని పెవిలియన్ చేరాడని భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నాడు. కోహ్లీ బలహీనతకు తగ్గట్లు బౌలింగ్, ఫీల్డ్ సెటప్ చేసిన సౌతాఫ్రికా అనుకున్న ఫలితాన్ని సాధించిందన్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ మంచి రిథమ్‌లో కనిపించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించిన విరాట్.. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. గత కొన్ని రోజులుగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను వెంటాడి మరీ విరాట్ కోహ్లీ వికెట్ ఇచ్చుకుంటున్నాడు.

అనవసర షాట్‌తో..
తాజా మ్యాచ్‌లో కూడా సహనం కోల్పోయిన అతను ఆఫ్ స్టంప్‌కు వైడ్‌గా వచ్చిన బంతిని గెలికి మరీ ఔటయ్యాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 11 టెస్ట్‌లు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం నాలుగు సెంచరీలు మాత్రమే చేశాడు. ఇక సెంచరీ అయితే 2019లో చివరిసారిగా సాధించాడు. అప్పటి నుంచి మళ్లీ అతను శతకం అందుకోలేదు. తాజా మ్యాచ్‌లో కోహ్లీ తన సెంచరీ నిరీక్షణకు తెరదించుతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎప్పటిలానే తన బలహీనతను రిపీట్ చేస్తూ పెవిలియన్ బాట పట్టాడు.

క్రెడిట్ అంతా బౌలర్, కెప్టెన్‌దే..
ఇక కోహ్లీ ఔట్‌పై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన అజిత్ అగార్కర్.. కోహ్లీ ఔటైన తీరును వివరించాడు. ప్రణాళిక తగ్గట్లుగా బౌలింగ్ చేసిన బౌలర్, ఫీల్డ్ సెటప్ చేసిన కెప్టెన్‌కు క్రెడిట్ ఇవ్వాలన్నాడు.'ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడటంలో విరాట్ కోహ్లీకి సమస్య ఉన్నట్లుంది.
లుంగి ఎంగిడి తన ఫస్ట్ స్పెల్ మాదిరి బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా బంతులు వేయకుండా.. దూరంగా వేసాడు. అతను చాలా ప్రమాదకరంగా కనిపించాడు. మొత్తానికి కోహ్లీ బలహీనతపై దెబ్బ కొట్టి ఫలితం రాబట్టాడు. బౌలర్‌తో పాటు ఫీల్డ్ సెటప్ చేసిన కెప్టెన్‌ను అభినందంచాలి'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీని టెంప్ట్ చేసి...
ఊరించే బంతితో కోహ్లీని టెంప్ట్ చేసి తమ బుట్టలో వేసుకున్నారని సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అన్నాడు. దాంతో సౌతాఫ్రికాకు కావాల్సిన బ్రేక్ త్రూ లభించింది. 'ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా ఊరించే బౌన్సర్ వేసారు. ఓపికతో కూడిన ఆటలో లుంగి ఎంగిడి వైడర్ బాల్‌తో విరాట్‌ను షాట్ ఆడేలా ఉసిగొల్పాడు.
పరుగులు చేయాలనే ఆతృతలో విరాట్ ఔటయ్యాడు. సౌతాఫ్రికాకు కీలక వికెట్ దక్కింది. ఆ టైమ్‌లో కోహ్లీ చాలా ప్రమాదకరంగా కనిపించాడు. క్రీజులో అతను ఆడిన విధానం, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంది. ఇది సౌతాఫ్రికాకు కావాల్సిన బ్రేక్ త్రూ'అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications