Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్.. భారత జట్టు ఇదే: అజిత్ అగార్కర్

ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం వెల్లడించారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అగార్కర్ ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జట్టు ఎంపికకు సంబంధించిన వివరాలతో పాటు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు.

అందరూ ఊహించినట్లుగానే భారత జట్టులో పెద్ద మార్పులేమి జరగలేదు. కుర్రాళ్లతో కూడిన జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతను సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడని అగార్కర్ తెలిపాడు. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కలేదు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను ఎంపిక చేశారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే అవకాశాన్ని అందుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలను కొనసాగించారు. మూడో పేసర్‌గా హర్షిత్ రాణాను తీసుకున్నారు. ఆసియా కప్ 2025 నుంచి మహమ్మద్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారు.

Ajit Agarkar Announces India s Asia Cup 2025 Squad

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025 జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అబుదాబి, దుబాయ్ వేదికగా మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఆసియాకప్ క్యాంపైన్‌ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. యూఏఈ, పాకిస్థాన్, ఓమన్‌తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది.

ఆసియా కప్ 2025 ఆడే భారత జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్‌బై ప్లేయర్స్

ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్

గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ - భారత్ మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 10: భారత్ vs యుఏఈ (దుబాయ్)

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్)

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబూదాబి)

Story first published: Tuesday, August 19, 2025, 14:56 [IST]
Other articles published on Aug 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+