ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగే భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న అజిత్ అగార్కర్.. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించాడు.
గాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ అప్‌డేట్ కోసం వేచి చూస్తున్నామని తెలిపాడు. ఫిట్‌నెస్ సాధించకపోతే ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండడని చెప్పాడు. అతని స్థానంలో హర్షిత్ రాణా ఆడుతాడని పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు డిప్యూటిగా శుభ్‌మన్ గిల్ వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు.

దేశవాళీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ నిలకడగా రాణిస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో అతనికి చోటు లేదని అజిత్ అగార్కర్ తెలిపాడు. అద్భుత ప్రదర్శనతో అతను తమ దృష్టిని ఆకర్షించాడని, ఎవరైన గాయపడితే అతన్ని పేరును పరిశీలిస్తామని చెప్పాడు.
అందరూ ఊహించినట్లుగానే జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మహమ్మద్ సిరాజ్ మినహా సీనియర్ ఆటగాళ్లందరికి అవకాశం దక్కగా.. కుర్రాళ్లకు మరోసారి నిరాశే ఎదురైంది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన మహమ్మద్ సిరాజ్‌పై వేటు పడింది. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం కల్పించారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి రిజర్వ్ ప్లేయర్‌గా అవకాశం దక్కింది. అతనితో పాటు ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తీ ట్రావెలింగ్ రిజర్వ్‌లో ఉన్నారు. సంజూ శాంసన్‌కు కూడా నిరాశే మిగిలింది. స్పిన్ ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సిరాజ్‌కు జట్టులో అవకాశం దక్కలేదని తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్
రిజర్వ్ ప్లేయర్స్: నితీష్ కుమార్ రెడ్డి, ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తీ
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, హహర్షిత్ రాణా(రిజర్వ్ ప్లేయర్).