Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. ఎన్నిసార్లు అడిగినా కోహ్లీ ఆ సీక్రెట్ ఏంటో చెప్పలేదు: అజింక్యా రహానే

టెస్ట్ ఫార్మాట్‌లో యువ ఆటగాళ్ల కంటే సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అజింక్యా రహానే అన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ పూర్వ వైభవం పొందాలంటే సీనియర్ ఆటగాళ్లను జట్టులో కొనసాగించాలన్నాడు. సీనియర్లంతా ఒకేసారి దూరమవుతుండటం టీమిండియాకు సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

సీనియర్లను గౌరవించాలి..

'గత రెండేళ్లుగా నాకు భారత జట్టులో అవకాశం రాకపోవడంతో ఇంట్లోనే కూర్చొని మ్యాచ్‌లు వీక్షించా. భారత జట్టు స్వదేశంలో కూడా ఓడిపోవడం కూడా చూశాను. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే చాలా పట్టుదల ఉండాలి. ప్రతి సెషన్ పూర్తిగా ఆడాలి. భారత్‌తో పాటు చాలా జట్లు అలా చేయడం లేదు. నేను ఏ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకోవడం లేదు. భారత టెస్ట్ టీమ్‌లోకి గత రెండేళ్లలో చాలా మంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. వారిని వదిలేయండి.

Ajinkya Rahane Urges Respect for Senior Players After Test Retirement Ahead of Sri Lanka Series

టెస్ట్ టీమ్‌లో 7-8 మంది సీనియర్లు, ముగ్గురు, లేదా నలుగురు యువ ఆటగాళ్లు ఉండేలా జట్టు కాంబినేషన్ ఉండాలి. కానీ ప్రస్తుత జట్టు పూర్తిగా కొత్త వాళ్లతో నిండిపోయింది. దాదాపు సీనియర్ ఆటగాళ్లంతా రిటైర్ అయ్యారు. మిగిలిన సీనియర్ ఆటగాళ్లను గౌరవించడం చాలా అవసరం. టెస్ట్ క్రికెట్‌ మనుగడపైనే నాకు భయంగా ఉంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల్లో టెస్ట్ క్రికెట్‌ కొనసాగాలి.'అని రహానే చెప్పుకొచ్చాడు.

అజాత శత్రువు అజింక్యా రహానే.. అయినా అతనికి అన్యాయమే: సునీల్ గవాస్కర్

అజాత శత్రువు అజింక్యా రహానే.. అయినా అతనికి అన్యాయమే: సునీల్ గవాస్కర్

కోహ్లీని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు..

‌వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సక్సెస్ సీక్రెట్ గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదని, అతనితో తనకు మంచి స్నేహం ఉందని రహానే తెలిపాడు. విరాట్ దూకుడు, తన ప్రశాంతతో టీమిండియాకు మంచి విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు.

'విరాట్ కోహ్లీ ఆలోచనా విధానం, అతని ఎత్తుగడలు భిన్నంగా ఉంటాయి. కానీ అదే అతని సక్సెస్ సీక్రెట్. దీని గురించి నేను అతన్ని చాలా సార్లు అడగడానికి ప్రయత్నించాను. కానీ అతను చెప్పలేదు. ఎలాంటి క్లూ కూడా ఇవ్వకుండా.. సరైన సమయంలో రిస్క్‌లు తీసుకుంటాడు. ధోనీ కూడా అలాగే ఉండేవాడు. కానీ విరాట్ వ్యూహాలు మరో స్థాయిలో ఉండేవి.

విరాట్ దూకుడు స్వభావం, నా ప్రశాంతత వల్ల మేమిద్దరం ఒకరికొకరం బాగా సహకరించుకున్నాం. మా భాగస్వామ్యాలు విజయవంతం కావడానికి మా మధ్య ఉన్న సానుకూల సంభాషణలే ముఖ్య కారణం. ఆస్ట్రేలియాపై మేం ఎన్నో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. వాటిలో విరాట్ కోహ్లీ ఒక నిర్దిష్ట బౌలర్‌ను ఎదుర్కోవాలని అనుకున్నప్పుడల్లా .. నా స్పందన సానుకూలంగా ఉంటే మరింత చెలరేగేవాడు.

IND vs SL: చరిత్ర సృష్టించిన అకిబ్ నబీ.. తొలి జమ్మూ పేసర్‌గా రికార్డ్!

Also Read

IND vs SL: చరిత్ర సృష్టించిన అకిబ్ నబీ.. తొలి జమ్మూ పేసర్‌గా రికార్డ్!

కోహ్లీకి స్లెడ్జింగ్ అంటే ఇష్టం..

కోహ్లీ తనను ఎవరైనా స్లెడ్జింగ్ చేయడాన్ని ఇష్టపడుతాడు. ప్రత్యర్థి ఆటగాడికి అదే రీతిలో బదులివ్వాలా?అని నన్ను అడిగేవాడు. అతనికి అది బాగా పనిచేసేది కాబట్టి.. స్లెడ్జ్ చేయ్ అని చెప్పేవాడిని. మా మధ్య స్నేహబంధం చాలా బాగుండేది. మైదానం బయట కూడా మేమిద్దరం చాలా సమయం కలిసి గడిపేవాళ్లం. ఈ రోజుల్లో కనిపించని విధంగా.. మేమిద్దరం క్రికెట్ గురించి మాట్లాడుకునేవాళ్లం. అతను ఎప్పుడూ సానుకులంగా ఉండేవాడు. బౌలర్‌పై దాడి చేయడానికి ఎప్పుడూ సంకోచించవద్దని నాకు చెప్పేవాడు.'అని రహానే పేర్కొన్నాడు.

Story first published: Wednesday, August 5, 2026, 17:50 [IST]
Other articles published on Aug 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+