రూల్స్ పాటించేందుకు మాకు అభ్యంతరం లేదు.. మా ఫోకస్ అంతా మ్యాచ్‌పైనే: రహానే

సిడ్నీ: బయో బబుల్ ప్రొటోకాల్స్‌పై భారత జట్టు ఏమాత్రం కోపంగా లేదని తాత్కలిక సారథి అజింక్యా రహానే అన్నాడు. ప్రస్తుతం తమ దృష్టంతా మూడో టెస్ట్‌పైనే ఉన్నదని స్పష్టం చేశాడు. అయితే కఠిన ఆంక్షల నడుమ హోటళ్లు, బయో బుడగలకే పరిమితం అవ్వడం కష్టమని వెల్లడించాడు. ఆసీస్‌తో మూడో టెస్టుకు ముందు అతను మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సిరీస్‌ను బాయ్‌కట్ చేస్తామన్న వార్తలపై స్పందించడానికి రహానే నిరాకరించాడు. అలాంటి నిర్ణయాలు టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకుంటుందన్నాడు. కరోనా నిబంధనలను పాటించేందుకు తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.

వారు చూసుకుంటారు..
'కరోనా నిబంధనలు పాటించేందుకు మాకేమీ అభ్యంతరం లేదు. సిడ్నీలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు క్వారంటైన్‌లో ఉండటం సవాలే. అయినా మేమేమీ ఇబ్బంది పడటం లేదు. మా ప్రాధాన్యాలేంటో మాకు తెలుసు. నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు మేమంతా సన్నద్ధమయ్యాం. సిడ్నీ సాధారణంగా ఉన్నా ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం అయ్యేందుకూ సిద్ధపడ్డారు. ఎలాంటి పరిస్థితులకైనా మేం సిద్దంగా ఉన్నాం. కేవలం ఆటపైనే దృష్టిసారిస్తున్నాం. దేనిపైనా కంప్లైంట్ చేయడం లేదు. ఏమైనా అవసరమైతే బీసీసీఐ, జట్టు యాజమాన్యం చూసుకుంటుంది.

ఆ ఇద్దరు అండగా నిలిచారు..
'కొత్త విషయాలు నేర్చుకొనేందుకు అశ్విన్ తపిస్తాడు. అతనికెన్నో నైపుణ్యాలు ఉన్నాయి. అయినా నిరంతరం నేర్చుకొనే తత్వమే అతడిని గొప్పవాడిగా మార్చింది. మిగిలిన రెండు టెస్టుల్లోనూ మాకోసం అతనిలాగే గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో ఎంతో మార్పు వచ్చింది. ఏడో స్థానంలోని ఆటగాడు బ్యాటింగ్ కొనసాగిస్తే భారీ స్కోర్లను ప్రత్యర్థి ముందు ఉంచొచ్చు. ఇక మైదానంలో ఫీల్డర్‌గా అతను అద్భుతమైన క్యాచులు అందుకున్నాడు. అతన్ని జట్టులోకి తీసుకోవడం ఎంతో మేలు చేసింది.

రోహిత్ కఠోర సాధన
సిడ్నీ టెస్టుకు రోహిత్‌శర్మ ఎంపికయ్యాడు. నెట్స్‌లో అతని బ్యాటింగ్ చాలా బాగుంది. ఏడెనిమిది సెషన్లు బాగా సాధన చేశాడు. మెల్‌బోర్న్‌లో మాతో కలిశాడు. రెండో టెస్టు మ్యాచు ముగియగానే అతను సాధన ఆరంభించాడు. సిడ్నీ టెస్టులో హిట్‌మ్యాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. అతని రాక జట్టులో ఉత్సాహాన్ని నింపింది.

స్పిన్నర్లకు స్వర్గధామం..
బ్యాటింగ్ చేసేందుకు సిడ్నీ పిచ్ అనువుగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లు చూసినా ఇది మంచి వికెట్టే. అయితే నాణ్యమైన క్రికెట్ ఆడటం ముఖ్యం. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుసు. మాకూ మంచి స్పిన్నర్లు ఉన్నారు. ఆసీస్ ప్లేయర్ నాథన్ లయన్ కూడా మంచి స్పిన్నరే. ఈ మైదనాంలో అతనికి గొప్ప రికార్డు ఉంది. అందుకే మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇక మెల్‌బోర్న్ టెస్టు విజయం చరిత్రలో నిలిచిపోతుంది. సొంతగడ్డపై ఆసీస్ తిరుగులేని జట్టు. వారెంతో ప్రమాదకరం. అందుకే మేం వారిని గౌరవిస్తాం. మూడో టెస్టులో శుభారంభం చేయడంపైనే మా దృష్టి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications