
నాకెంతో గర్వంగా ఉంది:
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ... 'మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నాకెంతో గర్వంగా ఉంది. అందరూ బాగా ఆడారు. అయితే ఈ విహాయం క్రెడిట్ అరంగేట్ర ఆటగాళ్లు మొహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్‌కే ఇవ్వాలనుకుంటున్నా. అడిలైడ్ మ్యాచ్ తర్వాత జట్టులోకి వచ్చిన వీళ్లిద్దరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు అద్భుతం. అలాంటి వ్యక్తిత్వమే ఎంతో ముఖ్యం. ఇక మేం అనుసరించిన ఐదు బౌలర్ల వ్యూహం ఈ మ్యాచ్‌లో చాలా బాగా పనిచేసింది. ఒక ఆల్‌రౌండర్ కావాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు' అని తెలిపాడు.

సిరాజ్ క్రమశిక్షణగా బౌలింగ్ చేశాడు:
'యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గురించి చెప్పాలంటే.. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్ గురించి మనకు తెలుసు. ఈ మ్యాచ్‌లో కూడా తను అదే స్థాయిలో ఆడాడు. మొహ్మద్ సిరాజ్ ఎంతో క్రమశిక్షణగా బౌలింగ్ చేశాడు. దేశవాలీ క్రికెట్‌లో వారికున్న అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది. మైదానంలో వారు ప్రదర్శించిన ఆటతీరు గొప్పగా ఉంది' అని జింక్స్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా.. గిల్ 80 (45+35) పరుగులు చేశాడు.

ఉమేష్ కోలుకుంటున్నాడు:
'అడిలైడ్ టెస్టులో ఒక గంట సమయంలోనే అంతా అయిపొయింది. కొదిసేపట్లోనే ఆట మా నుంచి దూరం అయింది. ఇప్పుడు కూడా నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఉమేష్ యాదవ్ కోలుకుంటున్నాడు. మేనేజ్మెంట్ మరియు వైద్య సిబ్బంది అతడి పరిస్థితిపై నిర్ణయం తీసుకుంటారు. రోహిత్ శర్మ తిరిగి రావడం పట్ల మేము సంతోషిస్తున్నాం. నిన్న అతనితో మాట్లాడా. జట్టులో కలవడానికి ఆతృతగా ఉన్నాడు' అని అజింక్య రహానే పేర్కొన్నాడు.

ఈ ఏడాది తొలి విజయం:
ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన భారత్ ఇటీవల అడిలైడ్ టెస్టులోనూ ఘోర పరాభవం పాలైంది. ఆ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యంలో నిలిచినా మూడో రోజు అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36/9 స్కోర్ సాధించి టెస్టు చరిత్రలో అవమానకరమైన రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియాకు దీటుగా బదులివ్వడమే కాకుండా ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications

వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ ట్వీట్.. ఎప్పటిదో తెలుసా?










