'రోహిత్ మాకు ముఖ్యమైన ఆటగాడు.. 4-6 ఇన్నింగ్స్‌ల్లోనే అతడిని జడ్డ్ చేయకూడదు'

చెన్నై: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకు ముఖ్యమైన ఆటగాడు అని టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. 4-6 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ సామర్థ్యంను జడ్డ్ చేయకూడదన్నాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. అతను తక్కువ స్కోరుకి ఔటవడం కంటే.. వికెట్ చేజార్చుకున్న తీరుపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. వీవీఎస్ లక్ష్మణ్, సంజయ్ మంజ్రేకర్ లాంటి వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

6, 12 పరుగులకే ఔట్:
గతేడాది కాలంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టెస్టుల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యట్లేదు. ఇటీవల కంగారు గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టులు ఆడిన రోహిత్ వరుసగా 26, 50, 44, 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇక స్వదేశంలో తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్టులోనూ 6, 12 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మపై వేటు వేసి యువ క్రికెటర్లకి అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అజింక్య రహానే స్పందించాడు. కేవలం 4-6 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ సామర్థ్యంపై ఓ అంచనాకి రావడం సరైంది కాదన్నాడు.

'రోహిత్ జట్టులో కీలకమైన ఆటగాడు:
'రోహిత్ శర్మ మా జట్టులో కీలకమైన ఆటగాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ అతను విలువైన పరుగులు చేశాడు. 4-6 ఇన్నింగ్స్‌ల్లోనే అతని సామర్థ్యంపై ఓ అంచనాకి రావడం సరైంది కాదు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలి. జట్టులో రోహిత్ ఉండటం చాలా సంతోషంగా ఉంది' అని జింక్స్ అన్నాడు. రెండవ టెస్ట్ కోసం పిచ్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మొదటి రోజు నుంచే టర్న్ అవుతుందని తాను అనుకుంటున్నానన్నాడు. మొదటి టెస్ట్‌లో ఏం జరిగిందో మరచిపోయి ముందుకు సాగాలని రహానే చెప్పుకొచ్చాడు. చెపాక్ వేదికగానే శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

జట్టు కోసమే పరుగులు చేస్తాం:
తన బ్యాటింగ్ వైఫల్యం వస్తున్న విమర్శలపై కూడా రహానే స్పందించాడు. 'రెండేళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్నాం. జట్టు కోసమే పరుగులు చేస్తాం తప్ప.. వ్యక్తిగత స్కోర్ల గురించి ఏమాత్రం ఆలోచించం. నా గత 10-15 టెస్ట్‌లు చూస్తే.. నేను చేసిన పరుగులు కనిపిస్తాయి' అని అన్నాడు. మెల్‌బోర్న్ టెస్ట్ సెంచరీ మినహా రహానే గత 6 ఇన్నింగ్స్‌లో 4, 22, 24, 37, 1, 0 రన్స్ చేశాడు. రెండో టెస్ట్‌లో ఎవరు ఆడతారన్న దానిపై రహానే ఏమీ చెప్పకపోయినా.. అక్షర్ పటేల్ ఫిట్‌నెస్ తమకు గుడ్‌న్యూస్ అని అన్నాడు.

పుజారాలో ఎలాంటి మార్పు లేదు:
'చెతేశ్వర్ పుజారాలో ఎలాంటి మార్పు లేదు. ఏదేమైనప్పటికీ అతడి బ్యాటింగ్ విధానాన్ని ఎవ్వరూ ప్రశ్నించరు. బయట ఏం మాట్లాడుకుంటారనేది మేం పట్టించుకోం. ఆసీస్‌లో అతడి ఆటతీరు, ఇప్పుడున్న ఆటతీరే మాకు ముఖ్యం. అతడు 80 వరకు టెస్టులు ఆడాడు. అతడి ఆటేంటో అతడికే తెలుసు. అతడి సామర్థ్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు' అని రహానే చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
యువతకు శుభవార్త.. తెలంగాణలో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ!!