Ajinkya Rahane: అంపైర్లది సరైన నిర్ణయమే.. విరాట్ రాకపై నేను కామెంట్ చేయలేను!

కాన్పూర్: న్యూజిలాండ్ జరిగిన తొలి టెస్ట్‌లో నిర్ణీత సమయానికి ముందే అంపైర్లు ఆటను నిలిపివేయడాన్ని టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే సమర్థించాడు. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తీసుకున్న నిర్ణయం సరైందేనని, వారిని తాను తప్పుబట్టడం లేదని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో సోమవారం ముగిసిన తొలి టెస్ట్‌లో భారత్ వికెట్ దూరంలో విజయాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన భారత్ చివరి వికెట్ తీయలేక డ్రాతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంపై రహానే మ్యాచ్ అనంతరం స్పందించాడు. ప్రత్యర్ధి బ్యాట్స్‌మన్ అద్భుతంగా ఆడారని కొనియాడాడు.

అంపైర్లది సరైన నిర్ణయమే..
'ఈ మ్యాచ్‌లో మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. ఇది చక్కటి టెస్ట్ మ్యాచ్. ప్రత్యర్థి జట్టు చాలా బాగా ఆడింది. తొలి సెషన్ తర్వాత మేం గొప్పగా పుంజుకున్నాం. చివరి వికెట్ సాధించడానికి మేం ఎంత చేయాలో అంతా చేశాం. అంతకుమించి భిన్నంగా చేయడానికేమీ లేదనే అనుకుంటున్నా. తొలి సెషన్ తర్వాత మేము పుంజుకున్నాం. మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశాం. మరో 5-6 ఓవర్లు బౌలింగ్ చేయాలని భావించాం. అంపైర్లతో ఇదే విషయాన్ని మాట్లాడాను కూడా. ''ఫీల్డింగ్ టీమ్ కాబట్టి మీరు బౌలింగ్ చేస్తున్నామంటున్నారు. కానీ వెలుతురు లేని కారణంగా బ్యాటింగ్ చేయడానికి వాళ్లు ఇష్టపడటం లేదు'అని వారు నాతో అన్నారు. నాకు తెలిసి అంపైర్లు తీసుకున్నది సరైన నిర్ణయమే'అని రహానే చెప్పుకొచ్చాడు.

మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది..
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారని రహానే మెచ్చుకున్నాడు. అరంగేట్ర ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన అయ్యర్ తన సత్తా చాటాడని కొనియాడాడు. టెస్టుల్లో అరంగేట్రం చేయడానికి అతడు చాలా కాలం పాటు ఎదురుచూడాల్సి వచ్చిందన్న రహానే.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన రహానేపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతనిపై వేటు వేయాలని అభిమానులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. విరాట్ రాకపై స్పందిస్తూ.. 'తదుపరి టెస్టుకు విరాట్ తిరిగి వస్తాడు. ముంబై గేమ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. మేనేజ్‌మెంట్ అంతా చూసుకుంటుంది'అని పేర్కొన్నాడు.

గెలిచే మ్యాచ్‌లో..
చివరి రోజు మిగిలిన తొమ్మది న్యూజిలాండ్ వికెట్లు తీసి సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్న భారత్ చివరకు 'డ్రా'తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆట ముగిసే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (146 బంతుల్లో 52; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అయితే రచిన్ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), ఎజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్) కలిసి భారత్‌కు చివరి వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయంకంటే 12 నిమిషాల ముందే (కనీసం మరో 3 ఓవర్లు పడేవి) అంపైర్లు ఆటను నిలిపివేశారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవగా... రెండో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications