ఆ ఒక్కడే మమ్మల్ని ఓడించాడు: అజింక్యా రహానే
లక్నో సూపర్ జెయింట్స్(LSG) అనామక ప్లేయర్ ముకుల్ చౌదరిపై కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) కెప్టెన్ అజింక్యా రహానే ప్రశంసల జల్లు కురిపించాడు. ముకుల్ ఒక్కడే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓడించాడని తెలిపాడు. అసాధారణమైన షాట్లతో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని కొనియాడాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం కోల్‌కతా వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన లక్నో జట్టును ఔటాఫ్ సిలబస్‌లా.. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ముకుల్ చౌదరీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో గెలిపించాడు. 7 భారీ సిక్స్‌లు బాది అసాధ్యమనకున్న లక్నో విజయాన్ని సుసాధ్యం చేశాడు.
ముకుల్ బ్యాటింగ్ అమోఘం..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన రహానే.. ముకుల్ అసాధారణ బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. 'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అమోఘం. ముకుల్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతను షాట్లు ఆడిన తీరు అమోఘం. ఇలాంటి మ్యాచ్‌ల్లో తప్పులను వెతకకూడదు. మా ప్రణాళికల అమల్లో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ ముకుల్ ఆడిన తీరుకు, ఆ భాగస్వామ్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే.

పిచ్‌పై స్లోయర్ బంతులు పనిచేశాయి. ఓ దశలో లక్నోకు కోల్పోయేది ఏం లేదు. అందుకే ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించారు. ముకుల్ షాట్లు మాత్రం అద్భుతం. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. ఓడినప్పుడు ఇంకాస్త మెరుగ్గా ఎలా ఆడాలనే విషయాన్ని ఆలోచిస్తాం.
ఈ వికెట్‌పై 180-185 అనేది మంచి స్కోరు. ఏది ఏమైనా లక్నో బ్యాటర్లు ఆడిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఆఖరి ఓవర్‌లో ఆవేష్ ఖాన్‌నే ఎక్కువ సేపు స్ట్రైకింగ్‌లో ఉంచాలని ఫీల్డింగ్ ముందుకు పెట్టాం. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదుగురు ఫీల్టర్లు సర్కిల్ లోపల ఉన్నప్పుడు చివరి ఓవర్ వేయడం బౌలర్లకు కష్టమే.'అని అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు.
ఉత్కంఠ పోరు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), అంగ్‌క్రిష్ రఘువంశీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) రాణించగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), రోవ్‌మన్ పోవెల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్థ్, దిగ్వేష్ రతి, ఆవేష్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు
అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. ముకుల్ చౌదరితో పాటు ఆయుష్ బదోని(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/38), అనుకుల్ రాయ్(2/32) రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications