
విమర్శకులపై సెటైర్లు..
''జనం నా గురించి మాట్లాడుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. జనం ఎప్పుడూ ముఖ్యమైన వ్యక్తుల గురించే మాట్లాడతారన్నది నా ఉద్దేశం. కాబట్టి వాళ్లేమనుకుంటున్నారన్న దాని గురించి నేను ఆందోళన చెందను. జట్టు కోసం ఏం చేశానన్నదే నాకు ముఖ్యం. 'నేను, పుజారా చాలా కాలంగా ఆడుతున్నా. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో మాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుసు. మా నియంత్రణలో లేని వాటి గురించి మేం ఆలోచించం'' అని రహానే చెప్పాడు.'' అని చెప్పాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రహానే 146 బంతుల్లో 61, పుజారా 206 బంతుల్లో 45 పరుగులు చేశారు. '

శార్ధూల్ ఫిట్..
శార్దూల్ ఠాకూర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని తెలిపాడు. అయితే భారత తుది జట్టుకు సంబంధించి ఎలాంటి విషయాలు పంచుకోలేదు. 'శార్దూల్ ఠాకూర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. టీమ్ కాంబినేషన్స్ ఆధారంగా అతను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది'అని రహానే చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ వాతావరణం, పిచ్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తే జట్టు బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. పైగా అతను స్వింగ్ బౌలర్. ఈ కారణంగానే శార్దూల్ ఠాకూర్‌కు తొలి టెస్ట్‌లో అవకాశం దక్కింది. బ్యాటింగ్‌లో రాణించకపోయినా.. బౌలింగ్‌లో మాత్రం కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక లార్డ్స్ టెస్ట్‌కు ముందు అతని తొడ కండరాలు పట్టేయడంతో ఇషాంత్ శర్మకు అవకాశం దక్కింది.

ఇషాంత్ ఔట్
ఇషాంత్ సైతం బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. కానీ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ కారణాలతోనే లీడ్స్ టెస్ట్‌లో కూడా శార్దూల్ ఆడటం ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే లీడ్స్ వాతావరణ భిన్నంగా ఉందని, ఎండలు కాచి, వికెట్‌పై టర్న్ లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చు. అప్పుడు శార్దూల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

సూర్యకు చాన్స్ ఇవ్వాలని..
ఇంగ్లండ్ టూర్‌లో విఫలమవుతున్న రహానేపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టూర్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింటిలోనూ రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. మిడిలార్డర్‌లో భాగస్వామ్యాలను నిర్మించడంలో రహానే ఫెయిలవుతున్నాడు.
దాంతో.. భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఫరూక్ ఇంజినీర్.. రహానెపై విమర్శలు గుప్పిస్తూ పరోక్షంగా అతనిపై వేటుని సూచిస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌కి రహానె లేదా పుజారాలో ఒకరిపై వేటు వేసి సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications












