Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని కోసమే మొయిన్ అలీని పక్కన పెట్టాం: అజింక్యా రహానే

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. మంచు ప్రభావం ఉన్నప్పటికీ ఔట్ ఫీల్డ్ అంత ఫాస్ట్‌గా ఉండదని చెప్పాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. గత కొన్ని మ్యాచ్‌ల్లో పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకరించింది. డ్యూ ప్రభావం ఉన్నప్పటికీ ఔట్ ఫీల్డ్ ఏ మాత్రం స్కిడ్ అవ్వదు. తుది జట్టులో మార్పులు గుర్తుకు లేదు. తర్వాత చెబుతాను. ఫీల్డింగ్‌లో మేం ఎలాంటి తప్పిదాలు చేయకుండా క్యాచ్‌లు పట్టుకోవాలి. మెరుపులా కదలాలి'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Ajinkya Rahane Reveals The Reason Why Moeen Ali Not Playing vs PBKS In IPL 2025

మరోవైపు టాస్ గెలిచినా తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. అన్రిచ్ నోర్జ్ కోసం మొయిన్ అలీని పక్కనపెట్టామని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. టాస్ అనేది మన నియంత్రణలో లేని విషయం. లక్ష్యాన్ని చేధించగల బ్యాటింగ్ లైనప్ మాకు ఉంది. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. అన్రిచ్ నోర్జ్ తుది జట్టులోకి రాగా మొయిన్ అలీ ఉద్వాసనకు గురయ్యాడు. అన్రిచ్ నోర్జ్ చాలా కష్టపడ్డాడు. అతని బౌలింగ్ చూసేందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ : క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చక్రవర్తి.

పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

Story first published: Tuesday, April 15, 2025, 19:28 [IST]
Other articles published on Apr 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+