Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే వరుణ్ చక్రవర్తీని పక్కనపెట్టాం: అజింక్యా రహానే

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు.

తమ తుది జట్టులో తప్పనిసరి మార్పులు చేయాల్సి వచ్చిందని, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ ఈ మ్యాచ్ ఆడటం లేదని టాస్ సందర్భంగా రహానే పేర్కొన్నాడు. గాయంతో వరుణ్ చక్రవర్తీ.. అనారోగ్యంతో సునీల్ నరైన్ దూరమయ్యారని తెలిపాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. కొంచెం పొడిగా ఉంది కానీ బ్యాటింగ్‌కు సహకరించే వికెట్. పిచ్‌పై గడ్డి కూడా తక్కువగానే ఉంది. పుంజుకోవడం అనేది నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంపై ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న క్షణాల్లో విజయం సాధించడమే ముఖ్యం. ఈ మ్యాచ్‌లో గెలవడంపై మేం ధీమాగా ఉన్నాం. జట్టులో రెండు తప్పనిసరి మార్పులు జరిగాయి. గత మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో వరుణ్ చక్రవర్తి గాయపడ్డాడు. నరైన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ ఇద్దరి స్థానాల్లో రోవ్‌మన్ పావెల్, నవ్‌దీప్ సైనీ జట్టులోకి వచ్చారు.'అని అజింక్యా రహానే తెలిపాడు.

Ajinkya Rahane Reveals Reason Behind Varun Chakaravarthy s Absence Against Punjab Kings in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

మరోవైపు టాస్ గెలిచినా తాను బౌలింగ్ ఎంచుకునేవాడినని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తాను టాస్ ఓడినా కోరుకున్నదే దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. 'టాస్ ఓడినందుకు ఎలాంటి దిగులు లేదు. నేను ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాను. రహానే బ్యాటింగ్ ఎంచుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను. రికీ పాంటింగ్‌తో నా కెమిస్ట్రీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కొనసాగుతోంది. మా కోచ్ యువ ఆటగాళ్లందరికీ పూర్తి స్వేచ్ఛనిస్తాడు. అంతేకాకుండా ఆయన మాకు ఒక స్ఫూర్తిప్రదాత. మేం విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.


తుది జట్లు:

పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

కేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

Story first published: Monday, April 6, 2026, 19:31 [IST]
Other articles published on Apr 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+