అందుకే ఆ రోజు యశస్వి జైస్వాల్‌ను బయటకు పంపించాను: రహానే
నిషేధం నుంచి తప్పించేందుకే యశస్వి జైస్వాల్‌ను మైదానం బయటకు పంపించానని టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్యా రహానే అన్నాడు. ఆ రోజు యశస్వి జైస్వాల్‌ను బయటకు పంపించకుండా ఉంటే నాలుగు మ్యాచ్‌లు నిషేధం పడేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రహానే తెలిపాడు.
దులీప్ ట్రోఫీ 2022 ఫైనల్లో సౌత్ జోన్-వెస్ట్ జోన్ తలపడ్డాయి. అప్పుడు వెస్ట్ జోన్‌కు రహానే కెప్టెన్‌గా ఉన్నాడు. యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో జైస్వాల్ హద్దుల ధాటి స్లెడ్జింగ్ చేశాడు. దాంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు అంపైర్లు సిద్దమవ్వగా.. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన రహానే.. జైస్వాల్‌ను మైదానం బయటకు పంపించాడు. రహానే తీరుతో తీవ్ర అసంతృప్తికి గురైన జైస్వాల్.. అయిష్టంగానే మైదానం వీడాడు.
బయటకు పంపించడంతో బచాయించాడు..
'గేమ్‌లో స్లెడ్జింగ్ అనేది సర్వసాధారణమే. ఒక్కోసారి ఆటకు ఫన్ తీసుకొస్తుంది. కానీ అది శ్రుతి మించకూడదు. ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేజారిపోతుందని అనిపించింది. బయటకు పంపించనందుకు యశస్వి జైస్వాల్ కూడా బాధపడ్డాడు. కానీ, ముందు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో గ్రహించే అలా చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆటగాళ్లు నిషేధం ఎదుర్కొన్నారు.

అవకాశం చేజారితే అందుకోవడం చాలా కష్టం. అందుకే అలా అతన్ని మైదానం నుంచి బయటకు పంపించా. కెప్టెన్‌గా సహచరుడిని ఆపాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ మ్యాచ్ రిఫరీ వెంగలిల్ నారాయణన్ నేను చేసిన పనిని ఊహించలేకపోయారు. అప్పటికే జైస్వాల్‌పై నాలుగు మ్యాచ్‌లు నిషేధం విధించేందుకు సిద్ధమైపోయారు. లెటర్‌ను కూడా సిద్దం చేశారు.
నా ముందే బ్యాన్ లెటర్ చించేసాడు..
మ్యాచ్ తర్వాత ఆ బ్యాన్ లెటర్‌ను నా ముందే ముక్కలు చేసేశారు. చివరికి జైస్వాల్ మీద నిషేధం పడలేదు. ఇప్పుడు అతను భారత జట్టులో సూపర్ ప్లేయర్. ఒకవేళ అతనిపై నిషేధం పడి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో అంచనా వేయలేం'అని రహానే గుర్తు చేసుకున్నాడు.
యశస్వి జైస్వాల్ ప్రస్తుతం టీమిండియా స్టార్ ఓపెనర్‌గా ఎదిగాడు. నిలకడగా రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అజింక్యా రహానే ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

