For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీ సేనకు అజింక్యా రహానే బ్యాటింగ్ టిప్స్.. అవి ఏంటంటే..?

Ajinkya Rahane offers Test batting tips to Mithali Raj and Co ahead of England Test

న్యూఢిల్లీ: 'చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోవాలి. బంతిని శరీరానికి దగ్గరగా ఆడాలి. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్టోక్స్ ఆడవద్దు. వర్షం అంతరాయం తర్వాత ఆటను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి'.. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న భారత మహిళల జట్టుకు మెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఇచ్చిన బ్యాటింగ్ టిప్స్ ఇవి. మహిళల టీమ్ హెడ్ కోచ్ రమేశ్ పోవార్ విజ్ఞప్తి మేరకు రహానే ఓ సెషన్‌లో మహిళా బ్యాటర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. రెండు టీమ్స్ ఇంగ్లండ్ బయల్దేరే ముందే ఈ సెషన్ జరిగింది.

క్వారంటైన్‌లో ఉన్నప్పుడే..

క్వారంటైన్‌లో ఉన్నప్పుడే..

73 టెస్ట్‌ల అనుభవం ఉన్న రహానేకు ఇంగ్లండ్‌లో పరిస్తితులపై బాగా అవగాహన ఉంది. ఈ క్రమంలో మిథాలీ అండ్ కో‌కు తను కీలక సూచనలు చేశాడు. 'రెండు టీమ్స్ ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న టైమ్‌లో 50 నిమిషాల జూమ్ సెషన్ ఏర్పాటు చేశారు. యూకేలో బాల్ ఎక్కువగా మూవ్ అవుతుంది కాబట్టి ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎక్కువ డ్రైవ్ చేయకూడదని రహానే వారికి సూచించాడు. వీలైనంత మేరకు బాల్‌ను బాడీకి క్లోజ్‌గా ఆడమని చెప్పాడు. లేట్ స్వింగ్ ఉన్నప్పుడు కవర్ డ్రైవ్ చేయాలని అనిపిస్తుంది. కానీ మొదట్లోనే స్ట్రోక్స్‌కు వెళ్లొద్దన్నాడు.

ఆలోచనలు నియంత్రణలో..

ఆలోచనలు నియంత్రణలో..

అలాగే ముందుగానే మెయిన్ టార్గెట్‌పై ఫోకస్ చేయకుండా.. చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని టెస్ట్ ఇన్నింగ్స్‌ను నిర్మించాలని చెప్పాడు. రెయిన్ బ్రేక్స్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇక, లాంగ్ పార్ట్‌నర్‌షిప్ చేసిన తర్వాత బ్యాటర్ల మైండ్ సెట్ ఎలా ఉండాలంటూ హర్మన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. పార్టనర్‌షిప్ కొనసాగుతున్నప్పుడు ప్లేయర్లు తమ ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందని రహానే చెప్పాడు. ఆట ముగిసిన తర్వాత పార్ట్‌నర్‌షిప్ గురించి అస్సలు ఆలోచించకుండా.. మళ్లీ గ్రౌండ్‌లోకి రాగానే దానిపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.'అని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.

రహానే టిప్స్‌తో మేం రెడీ ఉన్నాం..

రహానే టిప్స్‌తో మేం రెడీ ఉన్నాం..

రహానే ఇచ్చిన విలువైన సలహాలతో ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి జరిగే టెస్ట్‌కు తామంతా మానసికంగా సిద్దంగా ఉన్నామని వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ చెప్పింది. 'నేను కేవలం రెండు టెస్ట్‌లే ఆడా. ఈ నేపథ్యంలో రహానెతో మాట్లాడే చాన్స్ వచ్చింది. తన మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. తను ఇచ్చిన సలహాలతో లాంగ్ ఫార్మాట్‌లో ఎలా బ్యాటింగ్ చేయాలో అర్థమైంది. ఈ టెస్ట్‌కు మేం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాం'అని చెప్పుకొచ్చింది.

Story first published: Tuesday, June 15, 2021, 14:17 [IST]
Other articles published on Jun 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+