రహానే.. భారత ఇన్నింగ్స్‌ను **గూడ్చావుగా!! కోహ్లీ రనౌట్‌పై ఫాన్స్ ఫైర్!

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8x4), టెస్ట్ స్పెసలిస్ట్ చటేశ్వర్ పుజారా (43; 160 బంతుల్లో 2×4), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (42; 92 బంతుల్లో 3×4, 1×6)పర్వాలేదనిపించారు. గులాబి పోరులో మెరుపులు మెరిపిస్తుందనుకున్న భారత్ తొలి రోజు పూర్తిగా రక్షణాత్మకంగా ఆడింది. ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (15 బ్యాటింగ్), వృద్ధిమాన్ సాహా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2.. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లయన్ తలో వికెట్ తీశారు.

కోహ్లీ రనౌట్
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 77వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని మిడాఫ్ దిశగా ఫుష్ చేసిన అజింక్య రహానే.. సింగిల్ కోసం కోహ్లీని పిలిచాడు. వెంటనే స్పందించిన కోహ్లీ నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి వేగంగా పరుగెత్తుకెళ్లాడు. సడన్‌గా క్రీజు వెలుపలికి వచ్చి ఆగిపోయిన రహానే.. వద్దంటూ కోహ్లీని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ మళ్లీ వెనక్కు తిరిగాడు. ఈలోగా మిడాఫ్‌లో బంతిని అందుకున్న ఫీల్డర్ జోష్ హేజిల్‌వుడ్.. బౌలర్ లయన్‌కి బంతినివ్వడంతో కోహ్లీ రనౌట్ అయ్యాడు.

మైదానంలోనే క్షమాపణలు
విరాట్ కోహ్లీ, అజింక్య రహానే నాలుగో వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ తర్వాత మంచి షాట్లతో కోహ్లీ జోరు మీద కనిపించాడు. కానీ రహానేతో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ కోహ్లీ ఏ ఫార్మాట్‌లోనూ కనీసం ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేదు. కోహ్లీ రనౌటైన కొద్దిసేపటికే రహానె కూడా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే తనవల్లే రనౌట్ అయిన తప్పిదాన్ని గ్రహించిన రహానే.. కోహ్లీని చూస్తూ మైదానంలోనే క్షమాపణలు చెప్పాడు.

ఔట్ చేయకుంటే కోహ్లీ సెంచరీ చేసేవాడు
మూడో సెషన్లో దూకుడు పెంచిన సమయంలో విరాట్ కోహ్లీ ఔటవ్వడం నిజంగా భారత జట్టుకు షాకే. అతడు మరికాసేపు క్రీజులో ఉండుంటే భారత్ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ భారత అభిమానులు అజింక్య రహానేపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రహానేపై మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 'రహానేను కొట్టడానికి డ్రెసింగ్ రూంలో విరాట్ కోహ్లీ రాడ్ పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'రహానే.. భారత ఇన్నింగ్స్‌ను **గూడ్చావుగా' అని మరో అభిమాని కామెంట్ చేశాడు. 'నువ్ ఔట్ చేయకుంటే.. కోహ్లీ సెంచరీ చేసేవాడు', 'టెస్ట్ క్రికెట్‌లో రహానే ఎందుకు రనౌట్ కాడో ఇప్పుడు అర్ధమయింది', 'రనౌట్ చేశావ్.. నువ్ కూడా ఔట్ అయ్యావ్. ఇలానేనా చేసేది' అని ఫాన్స్ కెమెంట్స్ పెట్టారు.
టార్చర్ భరించలేక.. క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన పాక్ స్టార్ పేసర్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications