వైభవ్ సూర్యవంశీని వదిలేయండి.. ఇప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడించొద్దు: అజింక్యా రహానే
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ఒత్తిడి తీసుకురావద్దని క్రికెట్ పండిట్స్‌కు మాజీ క్రికెటర్ అజింక్యా రహానే సూచించాడు. అతను ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడని, కాస్త సమయం ఇవ్వాలని సూచించాడు. ఇప్పుడే టెస్ట్ క్రికెట్ కూడా ఆడించవద్దని హితవు పలికాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచినప్పటి నుంచి వైభవ్ టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికైన వైభవ్.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లో విఫలమైనా జింబాబ్వే పర్యటనలో సత్తా చాటి తన ప్రతిభను చాటుకున్నాడు.

వైభవ్‌కు కాస్త సమయం ఇవ్వండి..
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానే తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ టెస్ట్ కెరీర్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టమన్నాడు. అతనికి కాస్త సమయం ఇవ్వాలని, అనవసర ఒత్తిడి తీసుకురావద్దని అభిప్రాయపడ్డాడు.
'నా మాటలతో వైభవ్‌పై ఒత్తిడి తీసుకురావాలనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే జనాలు అతని గురించి చాలా మాట్లాడుతున్నారు. ఇది కేవలం రెండు ఐపీఎల్ సీజన్లు మాత్రమే. నేను గ్రహించిన విషయం ఏంటంటే.. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా భిన్నమైనది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఐపీఎల్‌లో 4, 5 ఓవర్లలో 70 పరుగులను సునాయసంగా ఛేజ్ చేయవచ్చు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అలా చేయడం చాలా కష్టం. కాబట్టి వైభవ్‌ను తన ఆట తనను ఆడనివ్వండి. ఎదగనివ్వండి.'అని రహానే చెప్పుకొచ్చాడు.
సీనియర్ ఆటగాళ్లను తీసుకోవాలి..
టెస్ట్ ఫార్మాట్‌లో యువ ఆటగాళ్ల కంటే సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అజింక్యా రహానే అన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ పూర్వ వైభవం పొందాలంటే సీనియర్ ఆటగాళ్లను జట్టులో కొనసాగించాలన్నాడు. సీనియర్లంతా ఒకేసారి దూరమవుతుండటం టీమిండియాకు సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు.
'గత రెండేళ్లుగా నాకు భారత జట్టులో అవకాశం రాకపోవడంతో ఇంట్లోనే కూర్చొని మ్యాచ్‌లు వీక్షించా. భారత జట్టు స్వదేశంలో కూడా ఓడిపోవడం కూడా చూశాను. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే చాలా పట్టుదల ఉండాలి. ప్రతి సెషన్ పూర్తిగా ఆడాలి. భారత్‌తో పాటు చాలా జట్లు అలా చేయడం లేదు. నేను ఏ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకోవడం లేదు. భారత టెస్ట్ టీమ్‌లోకి గత రెండేళ్లలో చాలా మంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. వారిని వదిలేయండి.
టెస్ట్ టీమ్‌లో 7-8 మంది సీనియర్లు, ముగ్గురు, లేదా నలుగురు యువ ఆటగాళ్లు ఉండేలా జట్టు కాంబినేషన్ ఉండాలి. కానీ ప్రస్తుత జట్టు పూర్తిగా కొత్త వాళ్లతో నిండిపోయింది. దాదాపు సీనియర్ ఆటగాళ్లంతా రిటైర్ అయ్యారు. మిగిలిన సీనియర్ ఆటగాళ్లను గౌరవించడం చాలా అవసరం. టెస్ట్ క్రికెట్ మనుగడపైనే నాకు భయంగా ఉంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల్లో టెస్ట్ క్రికెట్ కొనసాగాలి.’ అని రహానే చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

