
తొలి మూడు టెస్టుల్లో విజయం:
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే టెస్టుల్లో తనదైన నాయకత్వంతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు రహానే భారత్‌కు మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా అన్నింటిలోనూ విజయాలే సాధించాడు. మెల్‌బోర్న్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం ద్వారా రహానే ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. కెప్టెన్‌గా తొలి మూడు టెస్టుల్లో విజయం సాధించిన రెండో టీమిండియా సారథిగా రహానే నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోనీ తన తొలి మూడు టెస్టుల్లో విజయాల్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మహీ సరసన రహానే చేరిపోయాడు.

అప్పుడే షాకిచ్చాడు:
2017లో ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా 4 టెస్టుల సిరీస్ జరిగింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ భారీ విజయం సాధించగా రెండో టెస్టులో కెప్టెన్ కోహ్లీ సారథ్యంలో భారత్ గెలుపొందింది. ఇక మూడో మ్యాచ్ డ్రాగా ముగీయడంతో నాలుగో టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లోనే రహానే తొలిసారి కెప్టెన్సీ చేపట్టడమే కాకుండా భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. తన నాయకత్వంతో కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేయగా, భారత్ 332 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 137 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్ 106 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి. దీంతో రహానె నేతృత్వంలో టీమ్‌ఇండియా ఆ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్ రహానే 46, 38 పరుగులు చేశాడు.

రెండోసారి అఫ్గానిస్థాన్‌పై:
2018లో అఫ్గానిస్థాన్‌పై రెండోసారి రహానే కెప్టెన్సీ చేపట్టాడు. ఆ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత్ విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 474 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్ 109 పరుగులకే ఆలౌటవ్వగా.. రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులే చేసింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగులతో ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రహానే.. అఫ్గాన్ బ్యాటింగ్ చేస్తుండగా కెప్టెన్‌గా అదరగొట్టాడు. ఫీల్డింగ్‌లో మార్పులు, బౌలర్లకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చి అఫ్గాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

శతకంతో కదం తొక్కి:
ప్రస్తుత సిరీస్‌లో భారత్ తొలి టెస్టులో ఘోర పరాభవం పాలవ్వగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవులపై ఇండియా వచ్చాడు. పేసర్ మహ్మద్ షమీ గాయంతో మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. అంతకుముందే రోహిత్, ఇషాంత్ గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇక భారత్ పని అయిపోయిందని ఆశలు వదులుకున్నారు. అయితే అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ రహానే అదరగొట్టాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో వ్యూహాలు, ఫీల్డింగ్‌లో మార్పులతో అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 195, రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. ఇక బ్యాటింగ్‌లో శతకంతో కదం తొక్కి ప్రత్యర్థిపై 131 పరుగుల ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియాను మరోసారి ఆదుకున్నాడు.
బాక్సింగ్ డే టెస్టు: మైదానంలోనే.. విహారి, అభిమాని తెలుగు ముచ్చట్లు (వీడియో)


Click it and Unblock the Notifications












