For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గొప్ప మనసు చాటుకున్న అజింక్యా రహానే!

Ajinkya Rahane denies to cut a cake with Kangaroo on top
India Favourite To Reach World Test Championship Final After Gabba win | IND V ENG | Oneindia Telugu

ముంబై: బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ గెలుపొంది స్వదేశానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు అదిరిపోయే స్వాగతం లభిస్తోంది. తన కూల్ కెప్టెన్సీతో దేశం గర్వపడేలా చేసిన అజింక్యా రహానేకు కూడా అభిమానులు రెడ్ కార్పెట్‌తో ఘనస్వాగతం పలికారు. బ్యాండ్, బాజాతో అతని నివాసం వద్ద స్థానికులు సంబరాలు చేసుకున్నారు.

కుమార్తె ఆర్యను ఎత్తుకుని ఇంట్లోకి వెళ్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అతని సతీమణి రాధిక ఇన్‌స్టాలో పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో రహానే తన నాయకత్వంతో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్​ అనంతరం పెటర్నీలీవ్‌పై కోహ్లీ స్వదేశానికి వెళ్లగా.. సారథ్య బాధ్యతలు అందుకున్న జింక్స్​ జట్టును అద్భుతంగా నడిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో తనదైన నిర్ణయాలతో ఫలితాన్ని రాబట్టి 2-1తో సిరీస్ గెలిచేలా జట్టును ముందుండి నడిపించాడు.

అయితే మైదానంలోనే కాకుండా బయట కూడా తాను ఎంత నిరాడంబరంగా ఉంటానో రహానే నిరూపించుకున్నాడు. రహానే రాక సందర్భంగా స్థానికులు తెచ్చిన కేక్‌ను కట్ చేయడానికి ఈ భారత తాత్కలిక కెప్టెన్ నిరాకరించాడు. అభిమానులు అత్యుత్సాహంతో ఆ కేకుపై కంగారును ఉంచగా.. దాన్ని కట్ చేసి ప్రత్యర్థి జట్టును అవమానించలేనని రహానే చెప్పకనే చెప్పాడు. ఇదంతా ఓ లోకల్ న్యూస్‌ చానెల్‌లో ప్రసారం కావడంతో.. రహానేపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇక రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికాను సెప్టెంబర్ 26, 2014లో లవ్ అండ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతుల ముద్దుల కూతురే ఆర్య .

Story first published: Thursday, January 21, 2021, 18:50 [IST]
Other articles published on Jan 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+