పుజారను తిట్టొద్దు.. గతం గతః.. ఫ్రెష్‌గా బరిలోకి దిగాలి: రహానే

క్రైస్ట్‌చర్చ్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో 0-1తో వెనుకంజలో నిలిచిన కోహ్లీసేన సిరీస్‌ను కాపాడుకోవాలంటే శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో తప్పక గెలవాలి. అయితే తొలి టెస్ట్‌లో ఏం జరిగిందనేది మర్చిపోయి.. తదుపరి మ్యాచ్‌కు ఫ్రెష్‌గా సిద్ధం కావాలని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అంజింక్య రహానే తెలిపాడు.

ఆ బంతులను ప్రాక్టీస్ చేయాలి..
గురువారం మీడియాతో మాట్లాడిన రహానే తొలి టెస్టులో కివీస్ బౌలర్లు షార్ట్‌పిచ్ బంతులతో ఫలితాన్ని రాబట్టారని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు నెట్స్‌లో ఆ బంతుల్ని తీవ్రంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉందన్నాడు. ‘ఒక బ్యాట్స్‌మన్‌గా ఏదైనా షాట్ గురించి ఆలోచిస్తే దాన్ని నేర్చుకొని ఆడాలి. అలాంటప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. వెల్లింగ్టన్‌లో ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోవాలి' అని రహానే చెప్పుకొచ్చాడు.

తప్పులను గుర్తించాలి..
ఓటమికి గల కారణాలు తెలుసుకొని వాటిపై కసరత్తులు చేయాలని ఈ ముంబైకర్ తెలిపాడు. ‘జట్టుగా ఏం తప్పులు చేశామో వాటిని గుర్తించి సరిదిద్దుకోవాలి. నాకు తెలిసి మేం షార్ట్‌పిచ్ బంతుల్ని సాధన చేయాలి. ఇప్పటికైతే ఒక ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. రేపు మరో సెషన్ ఉంటుంది. ఆ బంతుల్ని ఆడడం నేర్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. నాకైతే బ్యాట్సమన్‌గా మన ఉద్దేశం ఏంటో బౌలర్‌కు తెలియజేయాలనే ఉంటుంది. ' అని రహానే చెప్పుకొచ్చాడు.

పుజారాను విమర్శించవద్దు..
పుజారా నెమ్మదిగా ఆడటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతనికి రహానే మద్దుతగా నిలిచాడు. 'తొలి టెస్టులో పుజారా పరుగులు తీయాలని ప్రయత్నించాడు. కానీ, కివీస్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇది అందరికీ జరిగేదే. ఎవరి ఆట వాళ్లది. తొలి టెస్టులో విఫలమయ్యాక ఇప్పుడు మరింత పట్టుదలగా రాణించాల్సిన అవసరం ఉంది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి ఎదురు దాడి చేస్తే ప్రతి ఒక్కరి ఆట అద్భుతంగా ఉంటుంది. అలాగే, నేను.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారాతో పోలిస్తే వేరేలా ఆడతా. ఒక జట్టుగా ఎలా ఆడాలో తెలిసుండాలి. ఈ పిచ్‌పై మంచి పేస్, బౌన్స్ లభిస్తుంది. తొలిరోజే పిచ్‌ను అర్థం చేసుకొని అందుకు తగ్గట్టే ఆడతాం' అని రహానే చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications